News


11,500 వరకు దిద్దుబాటు!

Tuesday 7th January 2020
Markets_main1578338270.png-30710

సెన్సెక్స్‌ 800 పాయింట్ల వరకు క్షీణించి ఈ ఏడాదిలో అత్యధిక ఒక్కరోజు నష్టాన్ని సోమవారం నమోదు చేసింది. 2019 జూలై 8 తర్వాత సెన్సెక్స్‌కు ఇది అత్యధిక ఒక్క రోజు నష్టం కూడా. నిఫ్టీ కీలకమైన 12,000 పాయింట్లకు దిగువన, సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల దిగువకు వచ్చేశాయి. ఈ దశలో కీలక మద్దతు స్థాయిలను అవి కోల్పోయాయి. గత ఐదేళ్ల కాలంలో చూస్తే 2015 ఆగస్ట్‌ 24న సెన్సెక్స్‌ ఒకేరోజు 1,625 పాయింట్లను కోల్పోయింది. 

 

గత ఐదేళ్ల కాలంలో ఇలా 40 ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా ఒక్కో సెషన్‌లో నష్టపోవడం జరిగింది. కానీ, మార్కెట్లు నూతన జీవితకాల గరిష్టాలను నమోదు చేస్తూనే ఉన్నాయి. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. 20 సెషన్లలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా ఒక్కో సెషన్‌లో నష్టపోయింది. ఇక 700 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ పడిపోయిన సందర్భాలు గత ఐదేళ్లలో 11 ఉన్నాయి. 

 

ఇరాన్‌ మిలటరీ కమాండర్‌ సులేమానిని అమెరికా అంతమొందించడం, తీవ్ర ప్రతీకార చర్యలు ఉంటాయని ఇరాన్‌ హెచ్చరించడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం అలముకుంది. ఇది మరింత తీవ్రరూపం దాలుస్తుందేమోనన్న భయంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపించారు. పెట్టుబడులను బంగారం వంటి సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపడంతో బంగారం ధర పెరిగింది. అలాగే, చమురు ధరలు కూడా బ్యారెల్‌ 70 బ్యారెళ్లకు చేరాయి. క్రూడ్‌ ధరలు పెరగడం మన ఎకానమీకి ప్రతికూలం. రూపాయి డాలర్‌ మారకంలో 72 స్థాయికి దిగిపోయింది. మన ఈక్విటీ మార్కెట్లు నూతన గరిష్టాల వద్ద ఉండడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ఫలితంగా భారీగా నష్టపోవడం జరిగింది. కానీ, బుల్‌ మార్కెట్‌కు ఇది విఘాతం కాదని, దీర్ఘకాల ఇన్వెస్టర్లు మార్కెట్లలో కరెక్షన్‌ను కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోవచ్చన్న సూచనలు నిపుణుల నుంచి వస్తున్నాయి. 

 

‘‘భౌగోళిక రాజీకీయ ఉద్రిక్తతలు అన్నవి బుల్‌ మార్కెట్‌ను ఆపలేవు. కాకపోతే స్వల్పకాల కరెక్షన్‌కు దారితీస్తాయి. ఏదైనా కుదుపు చోటు చేసుకుంటే కొనుగోళ్లకు అవకాశంగా తీసుకోవాలి. మొత్తం మీద దేశీయ ఈక్విటీ మార్కెట్లకు 2019తో పోలిస్తే 2020 మరింత మెరుగ్గా ఉంటుంది’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వీపీ అజిత్‌ మిశ్రా సూచించారు. ‘‘మార్కెట్‌ బుల్లిష్‌గా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ల స్పీడ్‌కు బ్రేక్‌ వేశాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇక పెరగకపోతే, మార్కెట్‌ వచ్చే వారం తిరిగి అప్‌ట్రెండ్‌ ఆరంభిస్తుంది’’ అని ట్రేడింగ్‌ బెల్స్‌ సహ వ్యవస్థాపకుడు అమిత్‌ గుప్తా పేర్కొన్నారు. ‘‘నిఫ్టీ సోమవారం గ్యాప్‌డౌన్‌ ప్రారంభంతో పొడవైన బేర్‌ క్యాండిల్‌ను ఏర్పరిచింది. సాధారణంగా ఇది మార్కెట్‌ ప్యాటర్న్‌ వెనక్కి మళ్లినట్టు తెలియజేస్తోంది. నిఫ్టీ 12,150 మద్దతును కూడా కోల్పోయింది. మొత్తం మీద నిఫ్టీ ప్యాటర్న్‌ బలహీనంగా ఉంది. తదుపరి మద్దతు స్థాయిలు 11,800ను పరిశీలించాల్సి ఉంటుంది. సమీప కాలంలో దిగువ వైపున టార్గెట్‌ 11,500. తదుపరి 3-4 వారాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి తెలిపారు.You may be interested

డిసెంబర్‌లో ‘సేవలు’ బాగున్నాయ్‌: పీఎంఐ

Tuesday 7th January 2020

న్యూఢిల్లీ: సేవల రంగం డిసెంబర్‌లో చక్కటి పనితీరు కనబరిచినట్లు ఐహెచ్‌ఎస్‌ పర్చేజింగ్‌ మార్కిట్‌  ఇండియా (పీఎంఐ) సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. సూచీ 53.3గా నమోదయినట్లు వివరించింది. నవంబర్‌లో ఈ సూచీ 52.7గా ఉంది. గడచిన ఐదు నెలల్లో సూచీ ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. నవంబర్‌లో సూచీ 52.7గా ఉంది. అయితే పీఎంఐ సూచీ 50 ఎగువన ఉంటే, దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది.

అమ్మకాల షాక్‌ -మార్కెట్లు బేర్‌

Monday 6th January 2020

సెన్సెక్స్‌- 780 పాయింట్లు డౌన్‌  12,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ మూడో రోజూ బ్యాంక్‌ నిఫ్టీ పతనం రూ. 3 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరి పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం దేశీయంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసింది. అమెరికాపై ఇరాన్‌, ఇరాక్‌ కాలుదువ్వితే కఠిన ఆంక్షలతోపాటు, ప్రతిదాడులు చేస్తామంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు షాక్‌ తగిలింది. ఇప్పటికే ఇరానియన్‌ జనరల్‌తోపాటు ఇరాకీ అధికారులు కొంతమంది అమెరికా డ్రోన్‌ దాడిలో మరణించడంతో మధ్యప్రాచ్యంలో

Most from this category