వెలుగులో టెలికాం షేర్లు
By Sakshi

టెలికాంకు బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం కమిటీని వేసేందుకు దృష్టి సారిస్తుందన్న వార్తలు వెలుగులోకి రావడంతో బుధవారం ట్రేడింగ్‌లో టెలికాం షేర్లు రివకరీ బాట పట్టాయి. గతవారంలో టెల్కోల నుంచి రూ.92,000 కోట్ల వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్‌కు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్ర, మంగళవారాల సెషన్స్ టెలికాం రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. సర్వీస్ ప్రోవైడర్లు ఎదుర్కోంటున్న ఆర్థిక ఒత్తిళ్లను అన్ని కోణాల్లో పరిశీలించి, వాటి తగ్గించడానికి సూచనలు ఇవ్వడానికి కమిటీ ఏర్పాటైనట్లు నిన్న డాట్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో నేడు టెలికాం రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. భారతీ ఎయిర్టెల్:- నేడు బీఎస్ఈలో ఈ షేర్లు రూ.363.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 3.12శాతం పెరిగి రూ.371.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. చివరికి 2.29శాతం లాభంతో రూ. 368.20 వద్ద స్థిరపడ్డాయి.
వోడాఫోన్ ఐడియా:- నేడు బీఎస్ఈలో ఈ షేర్లు రూ.4.00వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 8.57 శాతం పెరిగి రూ.4.18 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అయితే మార్కెట్ ముగింపు సమయానికి 1శాతం నష్టపోయి రూ.3.81 వద్ద స్థిరపడ్డాయి.
You may be interested
మీ దగ్గర ఎంత బంగారం వుందో చెప్పాల్సిందే!
Wednesday 30th October 2019త్వరలో కేంద్రం హుకుం మీ దగ్గర బంగారం ఎంతవుందో తెలుసుకోవడానికి, లెక్కల్లో ప్రకటించని బంగారాన్ని చట్టబద్ధం చేయడానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ పథకానికి రూపకల్పన చేస్తోందని, ఈ పథకానికి సంబంధించి విధివిదానాలను ప్రభుత్వం తొందరలో ప్రకటించనుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పరిమితికి మించిన బంగారం కలిగివుంటే ఈ పథకం ద్వారా వెల్లడించి, దానిపై పన్నులను చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ‘ఈ పథకంలో ఎంత బంగారం కలిగివుండాలనేదానిపై ప్రభుత్వం
అత్యంత విలువైన కంపెనీ ఆపిల్ కాదు..అరామ్కో!
Wednesday 30th October 20199నెలల్లో రూ. 4.8లక్షల కోట్ల ఆదాయం.... ఆపిల్ సహా దిగ్గజాలను మించిన సంపాదన... సంవత్సరాంతానికి లిస్టింగ్‌కు.. ప్రపంచంలోని కార్పొరేట్ కంపెనీలన్నింటిలోకి అత్యంత ఖరీదైన కంపెనీ ఏది? చాలామంది ఆపిల్ అనుకుంటారు, కొందరు గూగుల్ అని, కొందరేమో మైక్రోసాఫ్ట్ అని అoటారు. ఎందుకంటే ఇవన్నీ లిస్టయిన కంపెనీలు వీటి మార్కెట్ క్యాప్, ఆదాయవ్యయాల వివరాలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతుంటాయి. కానీ వీటన్నింటినీ తలదన్నే కంపెనీ ఒకటుంది... ఒక ఆపిల్, ఒక గూగుల్, ఒక ఎక్సాన్ మొబైల్‌ను కలిపితే ఎంత