టారీఫ్‌ల పెంపు: టెలికాం షేర్లకు రెక్కలు
By Sakshi

దేశీయ టెలికాం కంపెనీలు కాల్ సర్వీసులపై టారీఫ్‌ల పెంచడంతో సోమవారం ఈ రంగానికి చెందిన షేర్లు భారీగా లాభపడ్డాయి. దాదాపు నాలుగేళ్ల అనంతరం టారీఫ్ భారీ స్థాయిలో పెంచుతూ ఆదివారం ఆయాఆయా కంపెనీలు ప్రకటించాయి. వోడాఫోన్-ఐడియా, ఎయిర్టెల్ టారీఫ్‌ల పెంపు ఏకంగా 50శాతం దాకా, జియో టారీఫ్‌ల పెంపు 40శాతం దాకా ఉండనుంది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు నెలరోజుల పాటు కనెక్షన్ కలిగి ఉండాలంటే కనీసం రూ. 49 కట్టాల్సి రానున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వోడాఫోన్-ఐడియా, ఎయిర్టెల్ కోత్త రేట్లు డిసెంబంర్ 03 నుంచి అమల్లోకి రాగా, జియో రేట్లు డిసెంబర్ 6నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ తాజా పరిణామతో నేడు ట్రేడింగ్ ప్రారంభంలో ఈ రంగానికి చెందిన షేర్లు భారీ లాభంతో మొదలయ్యాయి. వోడాఫోన్ ఐడియా 23శాతం జంప్:- కొత్త గరిష్టాన్నికి రిలయన్స్ ఇండస్ట్రీస్:-
52-వారాల గరిష్టానికి ఎయిర్టెల్ షేరు
కంపెనీ షేరు బీఎస్ఈలో 6.26శాతం లాభంతో రూ.470.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.485.75 వద్ద 52-వారాల గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:30లకు షేరు క్రితం ముగింపు(రూ.442.30)తో పోలిస్తే 8.53శాతం లాభంతో రూ.480.05 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.259.11, రూ.485.75లుగా ఉన్నాయి.
కంపెనీ షేరు బీఎస్ఈలో 10శాతం లాభంతో రూ.7.51 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 23.50శాతం పెరిగి రూ.8.44 స్థాయిని అందుకుంది. ఉదయం గం.9:30లకు షేరు క్రితం ముగింపు(రూ.6.83)తో పోలిస్తే 16శాతం లాభంతో రూ.8 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.2.61లు, రూ.25.01లు నమోదయ్యాయి
కంపెనీ షేరు బీఎస్ఈలో 2.84శాతం లాభంతో రూ.1595.00వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 4శాతం పెరిగి రూ.485.75 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.9:30లకు షేరు క్రితం ముగింపు(రూ.1550.90)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.1604.70 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1055.35, రూ.1614.00లుగా ఉన్నాయి.
You may be interested
ఈ వారం స్టాక్ రికమెండేషన్లు
Monday 2nd December 2019ట్రెంట్ కొనచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 520 టార్గెట్ ధరై రూ.605 ఎందుకంటే: టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్ కంపెనీ నాలుగు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెస్ట్‌సైడ్(బ్రాండెడ్ ఫ్యాషన్ దుస్తులు), జూడియో(యువతరం కోసం క్యాజువల్ వేర్ దుస్తులు), స్టార్(ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైల్ స్టోర్), ల్యాండ్‌మార్క్(ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్) విభాగాలు వార్షికంగా మంచి వృద్ధినే సాధిస్తున్నాయి. ఈ రిటైల్ సంస్థ ఇటీవలనే జూడియో పేరుతో వేల్యూ ఫ్యాషన్ పార్మాట్లో స్టోర్స్‌ను
టెలికాం షేర్ల బూస్ట్...గ్యాప్‌అప్ ప్రారంభం
Monday 2nd December 2019టెలికాం కంపెనీలు టారీఫ్‌లను భారీగా పెంచిన నేపథ్యంలో ఆ షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో భారీ గ్యాప్‌అప్‌తో మొదలుకావడంతో స్టాక్ సూచీలు సైతం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 280 పాయింట్ల మేర పెరిగి 41,130 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 12,135 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల షేర్ల క్షీణతతో ట్రేడింగ్ మొదలైన కొద్ది నిముషాల్లోనే సూచీలు నష్టాల్లోకి