News


టారిఫ్‌ పెంపు అనంతరం టెలికం షేర్లు కొనొచ్చా?

Monday 9th December 2019
Markets_main1575867679.png-30126

టారిఫ్‌ల పెంపు ప్రకటనల అనంతరం టెలికం రంగంలో టర్నెరౌండ్‌ ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే టెలికం షేర్లు టారిఫ్‌ల పెంపు ప్రకటన అనంతరం మంచి ర్యాలీ జరిపాయి. ఈ నేపథ్యంలో టెలికం షేర్లలో ఎంటర్‌ కావచ్చా? కొంత కరెక‌్షన్‌ కోసం చూడాలా? అని రిటైల్‌ మదుపరి సందేహ పడుతుంటాడు. ఈ అంశంపై నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి...
టెలికం చార్జీల పెంపునకు స్పెక్ట్రం బకాయిల చెల్లింపు గడువు పెంచడం.. కంపెనీలకు రెవెన్యూ పరంగా కొంత ఊరటనిస్తుందని నిపుణుల అంచనా. చాలా కాలం తర్వాత ప్రధానమైన మూడు టెలికం కంపెనీలు టారిఫ్‌లను పెంచాయి. వొడాఐడియా, ఎయిర్‌టెల్‌లు మినిమం రిచార్జి ప్లాన్స్‌పై దాదాపు 40 శాతం వరకు చార్జీలు పెంచాయి. ఇతర పాపులర్‌ ప్యాకేజ్‌లపై సుమారు 25- 41 శాతం వరకు పెరుగుదల ఉండనుంది. ఈ పెరుగుదల టెల్కోల ఆపరేటింగ్‌ ఆరోగ్యం పెంచుతుంది. ఎప్పటిలాగే జియో తన పోటీదారుల కన్నా కాస్త తక్కువ పెంపుదల ప్రకటించింది. బేస్‌ప్యాక్స్‌, స్వల్పకాలిక ప్యాక్స్‌పై పెరుగుదల తక్కువే కాబట్టి, ఈ విభాగంలో జియో చొచ్చుకుపోవడం కొనసాగవచ్చని ఎమ్‌కే గ్లోబల్‌ ప్రతినిధి నావల్‌ సేథ్‌ చెప్పారు. తాజా ప్లాన్లు డౌన్‌ట్రేడింగ్‌ను తగ్గించేందుకు వీలుగా ప్రకటించాయన్నారు. తాజా పెరుగుదలతో ఎంట్రీ లెవల్‌ ప్యాక్‌కు, పాపులర్‌ ప్యాక్‌కు మధ్య వ్యత్యాసం బాగా పెరిగి డౌన్‌ట్రేడింగ్‌ తగ్గుతుందని వివరించారు.

చార్జీల పెంపుపై మార్కెట్‌ వర్గాలు హర్షం ప్రకటిస్తున్నా, కొంత అప్రమత్తత అవసరమని చెప్పారు. పెంచిన మొత్తాలన్నీ నికర రెవెన్యూలో ప్రతిబింబించకపోవచ్చన్నారు. మరోపక్క వచ్చే రెండేళ్లలో స్పెక్ట్రం వేలం వస్తుందని, ఇటు చూస్తే ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటన్నింటినీ కేవలం తాజా పెరుగుదల కవర్‌ చేయలేదని తెలిపారు. అటుపక్క జియో లిస్టింగ్‌కు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇదే జరిగితే టెలికం రంగంలో ఇన్వెస్టర్లకు మరో అవకాశం లభించినట్లవుతుందని చెప్పారు. చార్జీల పెరుగుదల స్టాక్‌ రీరేటింగ్‌కు దారితీయకపోవచ్చన్నారు. బకాయిల చెల్లింపునకు ఎయిర్‌టెల్‌, వొడాఐడియాలు తప్పక ప్రొవిజనింగ్‌ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వొడాఐడియా కన్నా ఎయిర్‌టెల్‌ షేరు మెరుగ్గా కనిపిస్తోందని నిపుణుల అంచనా. చార్జీల పెంపు ఎయిర్‌టెల్‌కే ఎక్కువ కలిసివస్తుందని, వొడాఐడియా కొనసాగింపునకు తాజా పెంపుదల ఎక్కువ సాయం చేయకపోవచ్చు. చార్జీలు పెంచాకకూడా కంపెనీ రెవెన్యూపై ఆందోళనలు కొనసాగుతాయి. అందువల్ల ఈ షేరుపై అనలిస్టులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. You may be interested

నవంబర్‌లో పెరిగిన ఉత్పత్తి : మారుతి షేరు జోరు

Monday 9th December 2019

నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెరగడంతో దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఈ నవంబర్‌ లో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం అధికం. ఇదే నవంబర్‌లో మొత్తం మొత్తం 1.39లక్షల ప్యాసింజర్‌ వాహనాలు ఉత్పత్తి జరిగిందని, గతేడాది

స్వల్ప లాభంతో మొదలైన మార్కెట్‌

Monday 9th December 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో మొదలైంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 40,527.24 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభంతో 11,939.10ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అటో, ఫార్మా, మెటల్‌, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా, బ్యాంకింగ్‌, రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోంటున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి

Most from this category