STOCKS

News


టెలికాం షేర్లకు సుప్రీం కోర్టు జోష్‌..!

Tuesday 21st January 2020
Markets_main1579602464.png-31076

టెలికాం సంస్థల తుది గడువు చెల్లింపు సవరణ పిటిషన్‌ను వచ్చే వారంలో విచారణ చేయడానికి సుప్రీం కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం టెలికం షేర్లు జోరు చూపించాయి. గత ఏడాది అక్టోబర్‌ 24న టెలికాం కంపెనీలు తమ లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం యూజర్‌ ఛార్జీలు(ఎస్‌యూసీ) 90 రోజుల్లోపు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లు వేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ జనవరి 23తో ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు గడువు ముగుస్తుంది. ఈ గడువు తేదీని పొడిగించాలని కోరుతూ వొడాఫోన్‌ ఐడియాతో పాటు ఇతర టెలికాం ఆపరేటర్లు సుప్రీంకోర్టులో సవరణ దరఖాస్తును దాఖలు చేశారు. విచారణ వచ్చేవారంలో జరగనున్నందున, 23 గడువుతేదీనాటికి టెలికాం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్లు కట్టాల్సిన అవసరం తప్పింది. అలాగే విచారణ అనంతరం గడువు పెంచితే, అది టెలికాం కంపెనీలకు మరింత వెసులుబాటు దక్కుతుంది. నిబంధనలకు లోబడి చెల్లింపు సమయాన్ని సుప్రీంకోర్టు పెంచవచ్చని టెలికాం కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 

ఏజీఆర్‌ పేమెంట్‌ తుదిగడువును సుప్రీంకోర్టు పొడగించవచ్చనే అంచనాలతో... వోడాఫోన్‌ ఇంట్రాడేలో 24శాతానికి పైగా లాభపడి రూ.6.04 స్థాయిని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 22.22శాతం లాభంతో రూ.5.94 వద్ద స్థిరపడింది.


భారతీ ఎయిర్‌టెల్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి(రూ.504.40) నుంచి 2శాతానికి పైగా రికవరి అయ్యి రూ.515.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి నిన్నటి ముగింపు(రూ.509.25)తో పోలిస్తే 0.13శాతం లాభంతో రూ.508.60  వద్ద స్థిరపడింది. 

టాటా టెలీసర్వీసెస్‌(మహారాష్ట్ర) షేరు ఇంట్రాడేలో 6.50శాతం పెరిగి రూ.2.79 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి 1.15శాతం నష్టంతో రూ.2.59 వద్ద స్థిరపడింది. 
 



You may be interested

ఐఎంఎఫ్‌ ఎఫెక్ట్‌...12,200 దిగువన నిఫ్టీ ముగింపు

Tuesday 21st January 2020

సెన్సెక్స్‌ 205 పాయింట్లు డౌన్‌ 55 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వర్ధమాన దేశాలలో ఇండియా ఆర్థిక వృద్ధి మరింత నీరసించనున్నట్లు తాజా అంచనాలలో పేర్కొంది. దీంతో ప్రపంచ వృద్ధి ప్రభావితం కానున్నట్లు అంచనా వేసింది. ఈ ప్రభావంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా రోజంతా దాదాపు నష్టాల మధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించగ్గ

బడ్జెట్‌ నేపథ్యంలో 15 బెస్ట్‌ స్టాక్స్‌!

Tuesday 21st January 2020

వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక వృద్ధికి ఊతమివ్వగల చర్యలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.3 శాతానికిలోపు కట్టడి చేయడం సమస్యాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం 2024కల్లా 5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీను అందుకునేందుకు వీలుగా ప్రణాళికలు ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల అటు ప్రభుత్వం.. ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థిక పురోగతికి వీలుగా పలు చర్యలను తీసుకున్న విషయం విదితమే. ఆర్థిక

Most from this category