News


టెలికాం షేర్లలో అమ్మకాల ఒత్తిడి

Tuesday 26th November 2019
Markets_main1574750090.png-29867

టెలికం రంగ షేర్లు మంగళవారం ఉదయం సెషన్లో నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ రద్దు కావడంతో ఆయా కంపెనీలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్‌ఈలో టెలికం రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ టెలికాం ఇండెక్స్‌ 4శాతం మేర నష్టపోయింది. ఈ రంగానికి చెందిన భారతీ ఇన్ఫ్రాటెల్‌ 7శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 5శాతం, ఆప్టిమస్‌ ఇన్ఫ్రాకామ్‌ 5శాతం, వోడాఫోన్‌ ఐడియా 4.50శాతం, మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ 4.50శాతం, జీటీఎల్‌ ఇన్ఫ్రాటెల్‌ 4శాతం నష్టపోయాయి. ,ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌ షేరు 2శాతం, వింధ్యా టెలీలింక్స్‌ 1శాతం, ఐటీఐ షేరు అరశాతం నష్టపోయింది. మరోవైపు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 4.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. You may be interested

ఛైర్మన్‌ రాజీనామా.... ‘జీ’ 5 శాతం డౌన్‌

Tuesday 26th November 2019

 జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్‌) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేయడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం సెషన్‌లో భారీగా నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 12.27 సమయానికి జీ 5.70 శాతం నష్టపోయి రూ. 324.20  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 343.80 వద్ద ముగసిన ఈ షేరు, మంగళవారం సెషన్‌లో రూ. 341.00 వద్ద ప్రారంభమైంది. కాగా రూ. 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోవడం

రిలయన్స్‌పై విశ్లేషకులు బుల్లిష్‌గా ఎందుకున్నారు?

Tuesday 26th November 2019

రిలయన్స్‌ జియో టారిఫ్‌లను పెంచేందుకు సిద్ధమవుతుండడంతో, గత కొన్ని సెషన్‌ల నుం‍చి గరిష్ఠ స్థాయిలో వద్ద ట్రేడవుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు, మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్‌ ప్రధాన వ్యాపారం బలహీనంగా ఉన్నప్పటికి, వినియోగధారిత  రిటైల్‌, టెలికాం వ్యాపారాలు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. ఇవి కంపెనీ స్టాక్‌ వాల్యుషన్లు పెరగడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఏడాది ప్రారంభం నుం‍చి ఇప్పటి వరకు గమనిస్తే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు

Most from this category