STOCKS

News


జియో ఛార్జీల పెంపుతో టెల్కోల జోరు

Thursday 10th October 2019
Markets_main1570689682.png-28802

 రిలయన్స్‌ జియో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించడానికి సిద్ధమవ్వడంతో గురువారం టెలికాం కంపెనీల (టెల్కోలు) షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌ కోసం నిర్దిష్ట చార్జీలను (ఐయూసీ) వసూల్‌ చేయడంతో జియో లాభం పెరగనుందని, అంతే కాకుండా ఈ రంగలోని పోటీ కంపెనీలయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా కంపెనీల లాభాలు కూడా పెరగనున్నాయని విశ్లేషకులు తెలిపారు. ‍కాగా జియో తీసుకున్న నిర్ణయం వలన గురువారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌-ఐడియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.02 సమయానికి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 4.90 శాతం లాభపడి రూ. 377.00 వద్ద, వొడాఫోన్‌ ఐడియా షేరు 6.84 శాతం లాభపడి రూ. 6.25 వద్ద ట్రేడవుతున్నాయి. అదేవిధంగా రిలయన్స్‌ జియో వలన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విలువ 2.58 శాతం లాభపడి రూ. 1,358.95 వద్ద ట్రేడవుతోంది.  You may be interested

ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ 18% పతనం!

Thursday 10th October 2019

 గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో  లక్ష్మీ విలాస్‌ బ్యాంకు(ఎల్‌వీబీ)ను విలీనం చేసే ప్రతిపాదనలకు ఆర్‌బీఐ అనుమతి నిరాకరించడంతో గురువారం ట్రేడింగ్లో ఈ రెండు సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 12.51 సమయానికి ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 18.02 శాతం నష్టపోయి రూ. 196.60 వద్ద ట్రేడవుతోంది. కాగా లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ 4.82 శాతం నష్టపోయి రూ. 25.65 వద్ద లోయర్‌ సర్యూట్‌ ఫ్రీజ్‌

ఐఆర్‌సీటీసీ ఐపీఓ అలాట్‌మెంట్‌ స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి!

Thursday 10th October 2019

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఐపీఓకి మంచి స్పందన వచ్చింది. ఈ ఇష్యూ దాదాపు 111 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయింది. 2.016 కోట్ల షేర్లకు 225.29 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఓకి సబ్‌స్క్రైబ్‌ చేసిన ఇన్వెస్టర్లు తమకు షేర్లు దక్కుతాయా? దక్కవా? అని ఉత్కంఠగా చూస్తుంటారు. ఐపీఓకి అప్లై చేసిన వాళ్లకు అక్టోబర్‌ 10 లేదా 11న అలాట్‌మెంట్‌ జరగవచ్చని అంచనా. అలాట్‌మెంట్‌ అయింది?

Most from this category