News


పాజిటివ్‌గా టెల్కోలు..వొడా-ఐడియా 11% అప్‌

Thursday 28th November 2019
Markets_main1574921323.png-29923

టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపుపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని ప్రభుత్వం అధికారులు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఈ పెంపు వచ్చే నెల నుంచి అనివార్యం కానుంది. కాగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో గురువారం సెషన్‌లో టెలికాం కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వొడాఫోన్‌-ఐడియా ఉదయం 11.23 సమయానికి ఏకంగా 11.03 శాతం పెరిగి రూ. 6.55 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 5.90 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం సెషన్‌లో రూ. 6.85 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అదే విధంగా భారతీ ఎయిర్‌టెల్‌ 0.68 శాతం లాభపడి రూ. 436.30 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో  రూ. 433.35 వద్ద ముగిసిన ఈ షేరు, రూ. 443.90 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.33 శాతం పెరిగి రూ. 1,575.05  వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ గురువారం సెషన్‌లో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీగా అవతరించడం గమనార్హం.



You may be interested

మరింత ర్యాలీ కష్టమే!

Thursday 28th November 2019

బడా బ్రోకరేజ్‌ల అంచనాలు దేశీయ ఎకానమీలో మందకొడితనం దేశీయ స్టాక్‌ సూచీలను నిలువరించలేకపోతోంది. ఒకపక్క ఎకానమీ నానాటికీ మందగమనంలోకి పయనిస్తుండగా, స్టాక్‌ సూచీలు ఆల్‌టైమ్‌ హైలను తాకుతున్నాయి. ఈ విధమైన వ్యత్యాస ప్రవర్తన ఇకపై ముగిసిపోనుందని, మార్కెట్‌లో మరింత ర్యాలీ ఇకముందు కష్టమేనని బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో పలువురు విధాన నిర్ణేతలు, పరిశ్రమ నిపుణులతో సమావేశం జరిపామని, ఆర్థిక గణాంకాలు వెనువెంటనే మెరుగుపడకపోవచ్చని వీరిలో ఎక్కువమంది అంచనా వేస్తున్నారని

ముకేశ్‌ అంబానీ@రూ.5లక్షల కోట్ల అధిపతి.

Thursday 28th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధితి ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. దేశంలోనే రూ.5లక్షల కోట్లను ఆర్జించిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు. తనసొంత కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం ట్రేడింగ్‌లో రూ.10లక్షల కోట్లను అందుకున్న నేపథ్యంలో ముకేశ్‌ సంపాదన రూ.5లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంల రెండో త్రైమాసిక ఫలితాల అనంతరం కంపెనీలో అదనంగా 2.76శాతం ప్రమోటర్ల వాటాను దక్కించుకోవడంతో కంపెనీలో ముకేశ్‌ మొత్తం వాటా 50.50శాతానికి చేరుకుంది. గత

Most from this category