News


డీఓటీ వైఖరిపై సుప్రీంలో పిల్‌: నష్టాలతో ముగిసిన టెలికాం షేర్లు

Tuesday 28th January 2020
news_main1580207057.png-31273

దేశీయ టెలికాం రంగ షేర్లు మంగళవారం మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ రంగానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఐటీఐ, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌ షేర్ల పతనంతో బీఎస్‌ఈలో టెలికాం సెక్టార్‌ ఇండెక్స్‌ 5శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. మార్కెట్‌ ముగిసే సరికి ఇండెక్స్‌ క్రితం ముగింపు(1,150.51)తో పోలిస్తే 4శాతం నష్టంతో 1161.62 వద్ద స్థిరపడింది. 

సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజీఆర్) చెల్లింపునకు సంబంధించి టెలికం కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (డిఓటీ)పై ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు కావడంతో టెలికాం రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వినియోదారుల హక్కుల ఫోరమ్‌ సుప్రీం కోర్టులో  ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ధాఖలు చేయడంతో టెలికాం రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు​అభిప్రాయపడుతున్నాయి. 

గతవారంలో ఏజీఆర్‌ సవరణ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేమని వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్‌(డీఓటీ)కు తెలియజేశాయి. దీంతో తదుపరి చర్యల కోసం డీఓటీ కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఏజీఆర్‌ అంశంలో టెలికాం సంస్థలకు మేలు చేకూరేలా డీఓటీ కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతుందనంటూ ఒక వినియోదారుల హక్కుల ఫోరం సుప్రీంకోర్టులో పిటీషన్‌ను ధాఖలు చేసింది.  

మరోవైపు ఏజీఆర్‌కు సంబంధించిన మరోసారి తమ వాదనలు వినాలని టెలికాం కంపెనీల ధాఖలు చేసి క్యురేటివ్‌ పిటీషన్‌ను సుప్రీం కోర్టు ఈవారంలో విచారించనుంది. 

ఎయిర్‌టెల్‌ 4.50శాతం నష్టంతో రూ.491.25 వద్ద, వోడాఫోన్‌ ఐడియా 7.50శాతం క్షీణించి రూ.5.37 వద్ద, భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 3శాతం పతనంతో 235.10 వద్ద, ఐటీఐ లిమిటెడ్‌ 6శాతం క్షీణంచి రూ.83.25 వద్ద ముగిశాయి.



You may be interested

41,000 దిగువకు సెన్సెక్స్‌

Tuesday 28th January 2020

సెన్సెక్స్‌ 188 పాయింట్లు మైనస్‌ 63 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మెల్టింగ్‌ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనలు వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో తొలుత లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరి రెండు గంటల్లో పెరిగిన అమ్మకాలు మార్కెట్లకు షాకిచ్చాయి. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 40,967 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 63 పాయింట్ల

నవీన్‌, సీసీఎల్‌.. జూమ్‌- హెచ్‌జీ ఇన్‌ఫ్రా వీక్‌

Tuesday 28th January 2020

క్యూ3 ఎఫెక్ట్‌- నవీన్‌, సీసీఎల్‌ జోరు హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ పతనం కరోనా వైరస్‌ భయాలతో ప్రపం‍చ మార్కెట్లు వెనకడుగులో ఉన్నప్పటికీ తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి డీలాపడ్డాయి. మధ్యాహ్నం 3 ప్రాంతంలో మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా మరోవైపు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో

Most from this category