News


వొడాఫోన్‌ 30 శాతం క్రాష్‌...ఎయిర్‌టెల్‌ 5 శాతం అప్‌

Friday 17th January 2020
Markets_main1579234870.png-30984

సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీం కోర్డు కొట్టివేయడంతో శుక్రవారం టెలికాం రంగ షేర్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండంగా, వోడా ఫోన్‌ షేరు మాత్రం భారీ నష్టాన్ని చవిచూసింది. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్‌ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్‌ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది.  ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ‍అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్‌టెల్‌ కోరింది. ఈ రివ్యూ పిటీషన్‌లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయకతప్పదంటూ వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.  

భారతీ ఎయిర్‌టెల్‌:- నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు 1శాతం నష్టంతో రూ.470.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సుప్రీం కోర్టు తీర్పు షేరుపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవడంతో తిరిగి లాభాల్లోకి మళ్లింది. ఒకదశలో 5.18శాతం లాభపడి రూ.498.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం 9:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.474.05)తో పోలిస్తే 4శాతం లాభంతో రూ.492.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ‍కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.269.25, రూ. 498.65లుగా నమోదయ్యాయి.

వోడాఫోన్‌ ఐడియా:- నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు 10శాతం నష్టంతో రూ.5.43 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 39శాతం నష్టాన్ని చవిచూసి రూ.3.66 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఉదయం గం. 9:40ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.6.03)తో పోలిస్తే 27శాతం లాభంతో రూ.4.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.61, రూ.23.04లుగా నమోదయ్యాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేడు క్యూ3 ఫలితాలను విడుదల చేయనుండంతో పాటు సబ్‌స్ర్కైబర్లు సంఖ్యపరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీగా రిలయన్స్‌జియో అవతరించడంతో నేడు ఈ కంపెనీ షేరు 0.85శాతం లాభంతో రూ.1551.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడే మరింత కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2శాతం​ లాభపడి రూ.1568.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1537.70)తో పోలిస్తే 1.78శాతం లాభంతో పోలిస్తే రూ.1565.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

అగ్రస్థానానికి జియో

Friday 17th January 2020

36.9 కోట్లకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో.. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. దిగ్గజ కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలను వెనక్కి నెట్టి అనతికాంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. గతేడాది నవంబర్‌ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. ఒక్క నవంబర్‌ నెల్లోనే

ఏజీఆర్‌ ఎఫెక్ట్‌- బ్యాంకులు వీక్‌

Friday 17th January 2020

టెలికం కంపెనీలు దాఖలు చేసుకున్న  సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. టెలికం కంపెనీలకు భారీగా రుణాలిచ్చిన జాబితాలో ప్రధానంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ తదితరాలున్నాయి. దేశీ టిలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లించవలసిందేనంటూ సుప్రీం కోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లు బలహీనపడ్డాయి. టెలికం కంపెనీలు తాజాగా సుప్రీం కోర్టును బకాయిల చెల్లింపులకు

Most from this category