News


మొబైల్‌ టెలికం జోష్‌- బ్యాంక్స్‌ వీక్‌

Friday 17th January 2020
Markets_main1579254588.png-30994

ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌ దూకుడు
కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా 
భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ పతనం
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, యస్‌ బ్యాంక్‌ డీలా
ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ నేలచూపు

సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలపై టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో మొబైల్‌ టెలికం, బ్యాంకింగ్‌ రంగ కౌంటర్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో ద్వారా మొబైల్‌ సర్వీసులను అందిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లకు ఓవైపు డిమాండ్‌ కనిపిస్తుంటే.. మరోపక్క వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. కాగా.. టెలికం రంగానికి రుణాలందించిన పలు బ్యాంక్‌ కౌంటర్లు సైతం ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలాపడ్డాయి. అక్టోబర్‌లో జారీ అయిన ఆదేశాల ప్రకారం బకాయిలు, పెనాల్టీలు, వడ్డీసహా రూ. 1.47 ట్రిలియన్లను టెలికం కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే.. కార్యకలాపాలు నిలిపివేయవలసిన(దివాళా) పరిస్థితులు తలెత్తవచ్చని ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా స్పష్టం చేయడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు టవర్ల దిగ్గజం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కౌంటర్‌లోనూ అమ్మకాలు పెరగడం గమనార్హం! నిధుల సమీకరణకు ఇన్‌ఫ్రాటెల్‌ కంపెనీలో వాటా విక్రయ అంశం తెరమీదకు వచ్చే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఇక మరోవైపు వొడాఫోన్‌ ఐడియాకు రుణాలిచ్చిన యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ తదితర బ్యాంకింగ్‌ కౌంటర్లకు సైతం అమ్మకాల సెగ తగులుతోంది. టెలికం కంపెనీలు ఎన్‌సీఎల్‌టీ బాట పడితే.. మొండిబకాయిల సమస్య మరితం ముదరవచ్చన్న అంచనాలే దీనికి కారణమని బ్యాం‍కింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

లాభాల రింగింగ్‌
మధ్యాహ్నం 2.15 ప్రాంతం‍లో మార్కెట్లు నామమాత్ర లాభాలతో కదులుతున్నాయి. ఇదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ 5.6 శాతం జంప్‌చేసి రూ. 500 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 504 సమీపంలో 26 నెలల గరిష్టాన్ని తాకింది. ఏజీఆర్‌ చెల్లింపుల కోసం నిధుల సమీకరణ చేపట్టడం ఈ కౌంటర్‌కు బలాన్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇతర కంపెనీల వినియోగదారులను ఆకట్టుకోవడం ద్వారా కూడా బిజినెస్‌ను పెంచుకునే వీలుండటం​ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఇదే విధంగా జియో ద్వారా మొబైల్‌ సేవల రంగంలో దూసుకెళుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 3 శాతం ఎగసి రూ. 1580 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1585 వరకూ పెరిగింది.

నష్టాల మోత
రుణ భారం, నష్టాలతో ఎదురీదుతున్న వొడాఫోన్‌ ఐడియా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 28 శాతం కుప్పకూలింది. రూ. 4.3 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 3.65 వరకూ జారింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 9 శాతం పతనమై రూ. 222 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 210 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. బ్యాంకింగ్‌ రంగంలో యస్‌ బ్యాంక్‌ 3 శాతం క్షీణించి రూ. 39 దిగువన కదులుతోంది. తొలుత రూ. 37 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఈ బాటలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ షేరు 2.6 శాతం నష్టంతో రూ. 44 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 41.4కు నీరసించింది. ఇంట్రాడేలో రూ. 1317కు జారిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుతం 3 శాతం వెనకడుగుతో రూ. 1349 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎస్‌బీఐ 2 శాతం క్షీణించి రూ. 318 దిగువన కదులుతోంది. రూ. 310 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది.



You may be interested

ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లో గూగుల్‌

Friday 17th January 2020

ఇంటర్‌నెట్‌ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ గురువారం ఆర్థికంగా అరుదైన ఘనతను సాధించింది. కంపెనీ మార్కెట్‌ మొత్తం విలువ తొలిసారి 1ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన నాలుగో అమెరికా కంపెనీగా చరిత్ర పుటలకెక్కింది. గురువారం రాత్రి అమెరికా మార్కెట్లో టెక్నాలజీ షేర్లలో భాగంగా అల్ఫాబెట్‌ షేరు విలువ 0.76శాతం పెరగడంతో దాని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ 1ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. టెక్‌ దిగ్గజం ఆపిల్‌ కంపెనీ 2018లో

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా...

Friday 17th January 2020

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది. ఈ క్యూ3లో కంపెనీ నికరలాభం 10-14శాతం వృద్ధిని సాధించవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, టెలికాం వ్యాపారాల పనితీరు మెప్పించవచ్చు. పెట్రోకెమికల్స్‌ వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. డిసెంబర్‌ క్వార్టర్‌లో రిఫైనింగ్ మార్జిన్లు 9.2-9.6డాలర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. జేఎం ఫైనాన్సియల్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు:- త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం

Most from this category