News


వచ్చే ఐదేళ్లలో ‘టెలికం’ నుంచి ఆదాయం: అగర్వాల్‌

Thursday 19th December 2019
Markets_main1576778769.png-30315

స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికీ టెలికం కంపెనీల పట్ల ఆశావహంగా ఉందని, ఈ రంగం పుంజుకుంటుందని అంచనాలే ఇందుకు కారణమని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. టెలికం ఆపరేటర్లు, ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఈ రంగం నుంచి డబ్బులు పిండుకోనున్నాయని ఆయన విశ్లేషించారు. ‘‘టెలికం అన్నది గత 13 ఏళ్లుగా ఓ ఉపద్రవం వంటిది. ఈ రంగంలో సేవలు అందించే కంపెనీలు మూడు నుంచి 17కు పెరిగాయి. తిరిగి మళ్లీ మూడుకు తగ్గిపోయాయి’’ అని అగర్వాల్‌ వివరించారు. మోతీలాల్‌ ఓస్వాల్‌ వార్షిక వెల్త్‌ నివేదిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత మందగమనం నుంచి దేశ ఆర్థిక రంగం త్వరలోనే పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్టు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ‘‘ఈ మందగమనం సరిదిద్దతగినదే. ఇందుకు 6-8 నెలల సమయం పడుతుంది’’ అని అగర్వాల్‌ అన్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి పరిమితం అయిన విషయం తెలిసిందే. ఇది ఇంకా బోటమ్‌ అవుట్‌ అవ్వలేదని, ఇంకా తగ్గిపోయే అవకాశం కూడా ఉందని నోమురా ఇటీవలే హెచ్చరించింది. 

 

సెన్సెక్స్‌లోని 30 కంపెనీలు భారత పరిస్థితిని నిర్వచించలేవన్నారు ప్రముఖ ఇన్వెస్టర్‌, బీఎస్‌ఈ సభ్యుడు రమేష్‌ దమానీ. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వాస్తవికంగా బెంచ్‌ మార్క్‌ సూచీలు ప్రతిబింబించడం లేదన్న దానిపై ఎంతో చర్చ నడుస్తోంది. సెన్సెక్స్‌ లేదా నిఫ్టీ పనితీరుకు, ఆర్థిక వ్యవస్థకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది’’ అని దమానీ పేర్కొన్నారు. సూచీలు రికార్డు గరిష్టాల్లో ఉంటే, ఆర్థిక వృద్ధి కనిష్టాల్లో ఉన్న అంశాలను ఆయన ఉదహరించారు. 1995లో టెలికం బూమ్‌ సమయంలో ఎంటీఎన్‌ఎల్‌ కౌంటర్లో తాను ఎంతో నష్టపోయినట్టు దమానీ తెలిపారు. అయితే, ఈ నష్టాలను పూడ్చుకునేందుకు అదే సమయంలో మంచి పనితీరు చూపించిన స్టాక్స్‌ను కూడా పోర్ట్‌ఫోలియోలో ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో నేను సైతం ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాను. ప్రస్తుత బేర్‌ మార్కెట్‌లోనూ చెక్కుచెదరని పోర్ట్‌ఫోలియో నా దగ్గరుందని చెప్పడం లేదు’’ అని మార్కెట్లలోని వాస్తవ పరిస్థితులను ఆయన విశదీకరించారు.You may be interested

యస్‌ బ్యాంకులో ఉన్నట్టుండి ఎందుకంత చలనం?

Thursday 19th December 2019

యస్‌ బ్యాంకు స్టాక్‌ గురువారం ఇన్వెస్టర్లను అయోమయానికి గురి చేసింది. ఉదయం సెషన్‌లో స్టాక్‌ 4 శాతం నష్టపోయి రూ.45 వరకు పడిపోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటర్లో ఒక్కసారిగా యాక్టివిటీ పెరిగిపోయింది. అక్కడి నుంచి స్టాక్‌ ఏకంగా 10 శాతానికి పైగా పెరిగింది. రూ.50.90 వరకు వెళ్లి, చివరికి రూ.49.90 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. దీని వెనుక నిధుల సమీకరణ, ఎఫ్‌అండ్‌వోలో బ్యాన్‌ అంశాలు కారణమై ఉండొచ్చని

మరో రికార్డు ముగింపు

Thursday 19th December 2019

12,250 పాయింట్లపైన ముగిసిన నిఫ్టీ సెన్సెక్స్‌ 41,600 పాయింట్లపైకి  స్టాక్‌ మార్కెట్లో గురువారం రికార్డుల హోరు కొనసాగింది. రెండు ప్రధాన స్టాక్‌ సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115 పాయింట్లు జంప్‌చేసి 41,673 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో చరిత్రలో ప్రధమంగా 12,250 పాయింట్ల స్థాయిపైన 12,260 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ‍ట్రంప్‌ను ఆ దేశపు దిగువ సభ అభిశంచిన

Most from this category