News


11,042 దాటితే మరింత పైకి..!

Tuesday 10th September 2019
Markets_main1568057121.png-28274

నిఫ్టీ-50 ఇక తదుపరి 11,042ను అధిగమించి నిలదొక్కుకుంటే తదుపరి ర్యాలీ చేయగలదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిఫ్టీ సోమవారం కీలకమైన 11,000 మార్క్‌ పైన క్లోజ్‌ అయింది. దీంతో డైలీ చార్ట్‌లో చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. గరిష్టంలో గరిష్టం, కనిష్టంలో కనిష్టాన్ని నమోదు చేయడం నిఫ్టీ వరుసగా మూడో రోజని మద్దతు స్థాయిలు అధిక స్థాయికి చేరాయనడానికి ఇది సూచికగా అనలిస్టులు పేర్కొంటున్నారు. దిగువ స్థాయిలో నిఫ్టీకి 10,900 బలమైన మద్దతుగా నిలుస్తుందన్నారు. 

 

సమీప కాల అంశాలన్నీ కూడా కొనుగోలు ధోరణినే సూచిస్తున్నాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌కు చెందిన అరుణ్‌ కుమార్‌ తెలిపారు. రానున్న సెషన్లలో నిఫ్టీ 11,130-11,200 వరకు ర్యాలీ చేస్తుందన్నారు. నిఫ్టీ ఇక సోమవారం కీలకమైన 21రోజుల ఈఎంఏ (10,990) పైన ముగియడం గమనించాలి. నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ డ్రాగన్‌ ఫ్లై డోజి ప్యాటర్న్‌ గరిష్టాన్ని దాటాయని, వీక్లీ చార్ట్‌లో గరిష్ట స్థాయిలో క్లోజ్‌ అయిందని, ట్రెండ్‌ రివర్సల్‌ను ఇది ధ్రువీకరించిందని ఏంజెల్‌ బ్రోకింగ్‌కు చెందిన రుచిత్‌ జైన్‌ పేర్కొన్నారు. సూచీ 11,100-11,180 దిశగా వెళుతుందన్న అంచనాను వ్యక్తం చేశారు. 

 

‘‘బుల్స్‌ నిదానంగా తమ బలాన్ని పెంచుకుంటున్నారు. వరుసగా నాలుగో రోజు నిఫ్టీ సానుకూలంగా క్లోజ్‌ అయింది. అయితే, ఇండెక్స్‌ 11,042 పైన క్లోజయితే మంచి సానుకూలత ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సూచీ 50 రోజుల ఈఎంఏ అయిన 11,174 దిశగా వెళుతుంది. లాంగ్‌ పొజిషన్లలో ఉన్న ట్రేడర్లు వాటిని కొనసాగించొచ్చు’’ అని చార్ట్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ సూచించారు. 



You may be interested

ఎఫ్‌ఐఐలు ఇప్పుడప్పుడే మళ్లీ తిరిగి వస్తారా...?

Tuesday 10th September 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక రంగం పుంజుకునేందుకు గాను పలు చర్యలను ప్రకటించినా కానీ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మాత్రం భారత్‌ పట్ల ఇంకా ఆందోళనతోనే ఉన్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి వారి పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోవడం అదే సూచిస్తోంది. భారత ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడమే వారి ప్రధాన ఆందోళనకు కారణం. ముఖ్యంగా ఆర్థిక రంగ

11000 పైన నిఫ్టీ ముగింపు

Monday 9th September 2019

బ్యాంకింగ్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ రెండోరోజూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 37000 స్థాయిపైన 37,145.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి  వారం రోజుల తరువాత నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారి 11000పైన 11,003 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌ 11000 పైన ముగిసిన నేపథ్యంలో షార్ట్‌టర్మ్‌ అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందనీ, 11180 స్థాయిని పరీక్షిస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మందగించిన ఆర్థిక

Most from this category