News


ఇండియా నివేష్‌ టాప్‌ సిఫార్సులు!

Friday 4th October 2019
Markets_main1570169429.png-28715

దేశీయ ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని సెషన్ల నుంచి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 
గత సెషన్‌లో ఎస్ అండ్ పీ బీఎస్‌ఈవ సెన్సెక్స్ 198 పాయింట్లు పడిపోయి 38,106 స్థాయికి, నిఫ్టీ 50 45 పాయింట్లు నష్టపోయి 11,314 స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ నుంచి సాంకేతిక సిఫార్సులు:
ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక సిఫార్సులు:
ఐషర్ మోటార్స్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .18,285 | టార్గెట్‌ ధర: రూ .19,800 | స్టాప్‌ లాస్‌: రూ .17,100 | 8 శాతం అప్‌సైడ్‌ కదలగలదు
మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్: కొనచ్చు | ప్రస్తుత ధర : రూ .427 | టార్గెట్‌ ధర: రూ 463 | స్టాప్‌ లాస్‌ : రూ .400 | అప్‌సైడ్‌ 8 శాతం
కోటక్ మహీంద్రా బ్యాంక్: అమ్మొచ్చు | ప్రస్తుత ధర: రూ .1,616 | టార్గెట్‌ ధర: రూ .1,490 | స్టాప్‌ లాస్‌: రూ .1,700 | డౌన్‌సైడ్‌ 7 శాతం చేరుకోవచ్చు.



You may be interested

ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పావుశాతం కోత

Friday 4th October 2019

దేశీయ బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ రంగాలపై మార్కెట్‌లు ఆందోళనగా ఉన్న ప్రస్తుతం సమయంలో ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) మరో దఫా రెపో రేటును తగ్గించి ఊరటనిచ్చింది. ఇప్పటికే ఈ ఏడాదిలో 110 బేసిస్‌ పాయింట్లను తగ్గించిన ఆర్‌బీఐ, శుక్రవారం సమావేశంలో మరో 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో ఈ ఏడాది మొత్తంగా 135 బేసిస్‌ పాయింట్లను తగ్గించినట్టయింది. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతం ఉంది.

పాలసీ ప్రకటనకు ముందు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అప్రమత్తత

Friday 4th October 2019

భారీ లాభంతో ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ క్రమంగా లాభాలను కొల్పోతుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు క్రితం ముగింపు (28,414)తో పోలిస్తే 278 పాయింట్లు లాభంతో 28,682 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతుతో ఇండెక్స్‌ 1.11శాతం(316 పాయింట్లు) పెరిగి 28730 స్థాయిని అందుకుంది. నేడు గం.11:30ని.లకు ఆర్‌బీఐ పాలసీ ప్రకటన

Most from this category