STOCKS

News


స్వల్ప కాలానికి స్టాక్‌ రికమండేషన్స్‌!

Tuesday 11th February 2020
Markets_main1581395846.png-31680

సాంకేతిక అంశాల ఆధారంగా సిఫారసులు
400 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్‌

అమెరికా స్టాక్‌ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ 9.40కల్లా క్వాడ్రపుల్‌ సెంచరీ సాధించింది. 409 పాయింట్లు జంప్‌చేసి 41,389 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125 పాయింట్లు ఎగసి 12,155ను తాకింది. సోమవారం కరోనా భయాల నుంచి బయటపడిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలవడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సోమవారం వరుసగా రెండో రోజు డీలా పడిన దేశీ మార్కెట్లలో సాంకేతిక అంశాల ఆధారంగా నిపుణులు కొన్ని స్టాక్‌ రికమండేషన్స్‌ ఇచ్చారు. చార్టుల ప్రకారం స్వల్ప కాలానికి మార్కెట్‌ నిపుణుల సిఫారసులు ఎలా ఉన్నాయో చూద్దాం..

- అశ్వనీ గుజ్రాల్‌, అశ్వనీ గుజ్రాల్‌.కామ్‌
బెర్జర్‌ పెయింట్స్‌: రూ. 594 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 576 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌: రూ. 1610 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 1565 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(టార్గెట్‌కు దగ్గరగా ‍ట్రేడవుతోంది)
బజాజ్‌ ఫైనాన్స్‌: రూ. 4820 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 4700 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌: రూ. 1710 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 1650 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
టీసీఎస్‌: రూ. 2200 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 2140 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

- సుదర్శన్‌ సుఖానీ, ఎస్‌2అనలిటిక్స్‌.కామ్‌
యాక్సిస్‌ బ్యాంక్‌: రూ. 731 టార్గెట్‌ ధరతో విక్రయించవచ్చు. రూ. 748 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(ప్రస్తుతం స్టాప్‌ లాస్‌ ట్రిగ్గర్‌ అయ్యింది)
హిందాల్కో: రూ. 182 టార్గెట్‌ ధరతో విక్రయించవచ్చు. రూ. 194 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(ఇంట్రాడేలో స్టాప్‌లాస్‌ను తాకింది)
టాటా మోటార్స్‌: రూ. 163 టార్గెట్‌ ధరతో విక్రయించవచ్చు. రూ. 173 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(ఇంట్రాడేలో స్టాప్‌లాస్‌ను తాకింది)
యూనియన్‌ బ్యాంక్‌: రూ. 55 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 48 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

- మితేష్‌ థక్కర్‌, మితేష్‌థక్కర్‌.కామ్‌
ఎంఆర్‌ఎఫ్‌: రూ. 75000 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 72390 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(ఇంట్రాడేలో స్టాప్‌లాస్‌ను తాకింది)
ఏషియన్‌ పెయింట్స్‌: రూ. 1900 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 1854 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(టార్గెట్‌కు దగ్గరగా ‍ట్రేడవుతోంది)
చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌: రూ. 345 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 330 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(టార్గెట్‌కు దగ్గరగా ‍ట్రేడవుతోంది)
యునైటెడ్‌ స్పిరిట్స్‌: రూ. 710 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 679 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(టార్గెట్‌కు దగ్గరగా ‍ట్రేడవుతోంది)



You may be interested

క్రీట్‌ విమానాశ్రయం నిర్మాణం జీఎంఆర్‌ చేతికి

Tuesday 11th February 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) గ్రీస్‌ క్రీట్‌లోని హెరాక్లియోన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్, నిర్వహణ బిడ్‌ను దక్కించుకుంది. దీంతో యూరోపియన్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బిడ్‌ గెలిచిన తొలి భారతీయ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గా జీఎంఆర్‌ నిలిచింది. జీఏఎల్, దాని గ్రీస్‌ భాగస్వామి జీఈకే టెర్నా కన్సార్టియం గతేడాది ఫిబ్రవరిలో కన్సెషన్‌ అగ్రిమెంట్‌ మీద సంతకాలు చేసిన విషయం తెలిసిందే.

రూ.200 తగ్గిన పసిడి

Tuesday 11th February 2020

మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.200 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,455.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటిముగింపు ధరతో పోలిస్తే 8 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,571.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

Most from this category