News


15నెలల కనిష్టానికి టెక్‌ మహీంద్రా

Wednesday 31st July 2019
Markets_main1564559108.png-27443

ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా షేర్లు బుధవారం 15నెలల కనిష్టానికి పతనమయ్యాయి. బ్రోకరేజ్‌ సంస్థలు షేరు కొనుగోలు ధరను తగ్గించడం ఇందుకు కారణమైంది. క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్రోకరేజ్‌ సంస్థలు షేరు కొనుగోలు ధరను తగ్గించాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ రూ.628.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఒక దశంలో 5శాతానికి పైగా నష్టపోయి రూ. 607.90ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరుకు 15నెలల కనిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.12:40నిల.కు షేరు గతముగింపు(రూ.640.3)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.625.10ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఇప్పటికే గడిచిన మూడు నెలల్లో ఈ షేరు 27శాతం క్షీణించింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.607.90 రూ. 840.10లుగా నమోదయ్యాయి. 

క్యూ1 ఫలితాలు:-  క్వార్టర్‌ టు క్వార్టర్‌ ప్రతిపాదికన కంపెనీ ఈ క్యూ1లో నికరలాభం 15శాతం క్షీణించింది. డాలర్‌ రూపంతో ఆదాయం వృద్ధి స్వల్పంగా 1.6శాతం నమోదైంది. ఎబిటా 27శాతం క్షీణించగా, మార్జిన్లు 3.9శాతం నమోదయ్యాయి. పెరిగిన వేతనాలు, వీసా ఖర్చులు,  రూపాయి క్షీణత, బలమైన ఒప్పంద మార్పిడి ఖర్చులు తదితర ప్రతికూలాంశాలుగా మారినట్లు కంపెనీ తెలిపింది. 
బ్రోకరేజ్‌ సంస్థల టార్గెట్‌ కోత:- క్యూ1లో ఫలితాలు నిరాశపరచడంతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు షేర్ల టార్గెట్‌ ధరను కోత విధించాయి. ఆర్థిక సంవత్సరపు ద్వితియార్థంలో రివకరి సాధిస్తుందనే ఆశాహనంతో అయితే ఇప్పటికి షేరు పై పాజిటివ్‌ దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు బ్రోకరేజ్‌ సంస్థలు తెలిపాయి. అలాగే రానున్న రోజుల్లో షేరు కరెక‌్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. 
సీఎల్‌ఎస్‌ఏ:- అవుట్‌ఫెర్‌ఫామింగ్‌ రేటింగ్‌ను కేటాయించింది. షేరు టార్గెట్‌ ధరను రూ.800ల నుంచి రూ.740లకు తగ్గించింది. రికార్డు స్థాయిలో డీల్స్‌ సాధించడం కంపెనీకి కలిసొచ్చే అంశమని తెలిపింది. సప్లై సవాళ్లు, పరివర్తన వ్యయాలు, డిజిటల్‌ మార్జిన్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం లాంటి సమస్యలను కంపెనీ ఎదుర్కోంది బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది.
సిటి బ్రోకరేజ్‌ సంస్థ:- న్యూట్రల్‌ రేటింగ్‌ను కేటాయించింది. షేరు టార్గెట్‌ను రూ.780ల నుంచి రూ.705లకు తగ్గించింది.క్వార్టర్‌ టు క్వార్టర్‌ ప్రతిపాదికన కమ్యూనికేషన్‌, ఎంటర్‌ప్రైజెస్‌ ఆదాయం క్షీణత కారణంగా ఈ క్యూలో కంపెనీ బలహీన ఫలితాలను నమోదు చేసింది. అయితే, క్యూ1లో 475 మిలియన్‌ డాలర్ల డీల్స్‌ను సాధించడం కలిసొచ్చే అంశమని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.
క్రిడెట్‌ శాష్యూ:- అవుట్‌ ఫెర్ఫామింగ్‌ రేటింగ్‌ను కేటాయించింది. షేరు టార్గెట్‌ ధర రూ.910 నుంచి రూ.730కు తగ్గించింది. మార్జిన్లు క్షీణించడం, నాన్‌ టెలికామ్‌ కమ్యూనికేషన్‌ వ్యాపార రంగంలో ఆశించిన రాణించలేకపోయిందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.You may be interested

200 డీఎంఏ కూడా కాపాడలేదు.. తర్వాతేంటి?

Wednesday 31st July 2019

నిఫ్టీ పయనం ఎటు... ఈ నెల 13న గత ఫిబ్రవరి తర్వాత తొలిసారి నిఫ్టీ తన 200 డైలీ మూవింగ్‌ యావరేజ్‌(డీఎంఏ) స్థాయి దిగువకు వచ్చింది. ఫిబ్రవరి 12న నిఫ్టీ 200 రోజుల డీఎంఏ మద్దతు కోల్పోయి 10585 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి బౌన్స్‌ బ్యాక్‌ అయింది. సాధారణంగా 200 రోజుల డీఎంఏను బలమైన మద్దతు స్థాయిగా పరిగణిస్తారు. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు బలంగా ఉన్నట్లు, దిగువకు వస్తే

కాఫీ డే రేటింగ్‌పై నెగిటివ్‌ ప్రభావం : ఇక్రా

Wednesday 31st July 2019

తాజా పరిణామాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ రేటింగ్‌ నెగిటివ్‌గా మారవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా హెచ్చరించింది.‘ తాజా పరిణామాలతో (వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణం) కంపెనీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం వున్నందున, ఈ కంపెనీ రేటింగ్‌ను గమనిస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే పరిణామాలు (సిద్ధార్థ మృతి...తదనంతర పరిస్థితులు) ప్రారంభ దశలో ఉండడంతో ఇంకా రేటింగ్‌కు తగ్గించే విషయంలో  ఒక నిర్ధారణకు రాలేదు’ అని ఇక్రా తెలిపింది.

Most from this category