News


ట్రేడింగ్‌ బెల్స్‌ నుంచి టెక్నికల్‌ సిఫార్సులు

Friday 6th September 2019
Markets_main1567765479.png-28243

షార్ట్‌టర్మ్‌కు 5 స్టాకులపై ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈఓ అమిత్‌గుప్తా అంచనాలు ఇలా ఉన్నాయి..
1. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 65. డైలీ చార్టుల్లో రివర్సల్‌ సంకేతాలు ఇస్తోంది. కచ్ఛితమైన స్టాప్‌లాస్‌(రూ.58)తో కొనుగోలు చేయవచ్చు. వారం పదిరోజుల్లో టార్గెట్‌ సాధించే ఛాన్సులున్నాయి. 
2. దిలీప్‌ బుల్డ్‌కాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 420. స్టాప్‌లాస్‌ రూ. 350. దీర్ఘకాలిక చార్టుల్లో నెగిటివ్‌గా ఉన్నా, డైలీ చార్టులో చిన్నపాటి ట్రెండ్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. పది రోజుల కాలానికి కొనుగోలు చేయవచ్చు.
3. కోల్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 210. స్టాప్‌లాస్‌ రూ. 179. టెక్నికల్‌గా బాటమ్‌ అవుట్‌ అవుతున్న సంకేతాలు ఇస్తోంది. పదిహేను రోజుల కాలపరిమితితో కొనుగోలు చేయవచ్చు.
4. అవంతి ఫీడ్‌: పాజిటివ్‌. టర్గెట్‌ రూ. 375. చార్టుల్లో బుల్లిష్‌గా ఉన్నందున హోల్డ్‌ చేయవచ్చు. కనీసం మరో నెలపాటు అమ్మకుండా ఉంచుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ. 310. 
5. ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌: టార్గెట్‌ రూ. 1660. స్టాప్‌లాస్‌ రూ. 1490. నెలరోజుల కాలపరిమితితో హోల్డ్‌ చేయవచ్చు.


 



You may be interested

30 శాతం పెరిగిన వీఐఎక్స్‌

Friday 6th September 2019

బడ్జెట్‌నాటి నుంచి చూస్తే వోలటాలిటీ ఇండెక్స్‌ అయిన ఇండియా వీఐఎక్స్‌ సూచీ 30 శాతానికి పైగా పెరిగింది. అంటే సమీప కాలంలో వొలటాలిటీ (అస్థిరతలు/ఆటుపోట్లు) ఉంటుందని మార్కెట్లు అంచనా వేస్తున్నట్టు సూచీ పెరుగుదల తెలియజేస్తోంది. ఇండియా వీఐఎక్స్‌ జూలై 5న (కేంద్ర బడ్జెట్‌ రోజు) 13.06గా ఉంటే, ఈ నెల 5 నాటికి అది 17.27 స్థాయికి పెరిగిపోయింది. రెండు నెలల్లోనే 32 శాతం పెరిగింది. కానీ, ఇదే కాలంలో

సెన్సెక్స్‌ లాభం 337 పాయింట్లు

Friday 6th September 2019

నిఫ్టీ 10950 సమీపంలో ముగింపు రాణించిన అటో, మెటల్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్లు సూచీలు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 337 పాయింట్ల లాభంతో 36,981.77 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్లు పెరిగి 10,941.00 వద్ద ముగిసింది. అటో, మెటల్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. అక్టోబర్‌ నుంచి అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య తాజాగా వాణిజ్య చర్చలు పునఃప్రారంభం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 1శాతం వరకు

Most from this category