జీవితకాల గరిష్టానికి చేరువలో టీసీఎస్
By Sakshi

దేశ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు మంగళవారం ఉదయం సెషన్స్‌లో ఆల్‌టైంకి చేరువలో ట్రేడ్ అవుతున్నాయి. క్రితం ట్రేడింగ్ సెషన్లో దాదాపు 2.5శాతం లాభపడిన ఈ షేర్లు నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.2237.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో 1.25శాతం లాభపడి రూ.2257.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. కాగా ఈ షేరు జీవితకాల గరిష్టస్థాయి రూ.2273లుగా ఉంది. ఉదయం గం.11:15ని.లకు షేరు గతముగింపు(రూ.2231.1)తో పోలిస్తే రూ.1.04 లాభంతో రూ.2254లుగా ఉంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1725.40 రూ.2273.00లుగా నమోదయ్యాయి.
మార్కెట్ క్యాప్‌లో టీసీఎస్ మళ్లీ టాప్:-
అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీగా టీసీఎస్ మరోసారి చరిత్రకెక్కెంది. కంపెనీ సోమవారమే ఈ ఘనతను సాధించింది. నేడు మరోసారి షేర్లు 1శాతానికి పైగా ర్యాలీ చేయడంతో మార్కెట్ క్యాప్ రూ. 844,661.80 కోట్లకు చేరుకుంది. కాగా మార్కెట్ క్యాప్‌లో తన ప్రత్యర్థి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 8,40,619.89 కోట్లుగా ఉంది. అలాగే అమెరికా ఆధారిత ఐటీ సేవల సంస్థ ఐబీఎం మార్కెట్‌క్యాప్‌ను కూడా టీసీఎస్ అధిగమించింది. నిన్న రాత్రి మార్కెట్ ముగిసే సమయానికి ఐబీఎం మార్కెట్ క్యాప్ రూ.8.29 లక్షల కోట్లుగా నమోదైంది. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల తర్వాత అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. ,6, 67,199 కోట్లు), హిందుస్తాన్ యూనిలివర్(రూ.3, 98,096 కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ.377,428 కోట్లు) ఉన్నాయి.
You may be interested
జెట్ ఎయిర్వేస్ను వీడని నష్టాలు
Tuesday 11th June 2019మరో 14శాతం నష్టపోయిన షేర్లు గత కొద్ది రోజులుగా నష్టాల బాటలోనే ప్రయాణిస్తున్న ప్రైవేట్ రంగ సంస్థ జెట్ ఎయిర్వేస్ షేర్లు మంగళవారం మరో 14.50శాతం నష్టపోయాయి. హిందూజా, ఎతిహాత్ కంపెనీలు జెట్ ఎయిర్ పునరుర్ధణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే వార్తలు ఇందుకు కారణమవుతున్నాయి. నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.112.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. లండన్ ఆధారిత హిందూజా గ్రూప్ జెయిట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలుకు చేపట్టిన చర్చలను
స్వల్పంగా పెరిగిన పసిడి
Tuesday 11th June 2019ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పటికీ.., పసిడి ధర మంగళవారం లాభపడింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 4 డాలర్లు పెరిగి 1,333.75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెక్సికో దిగుమతులపై అమెరికా పన్ను విధింపు విరమించుకోవడంతో పాటు డాలర్ ఇండెక్స్ కనిష్టస్థాయిల నుంచి రివకరి కావడంతో రాత్రి అమెరికా మార్కెట్లో 16