మార్కెట్‌ను మెప్పించని టీసీఎస్ ఫలితాలు
By Sakshi

3శాతం పతనమైన షేర్లు
ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ.., బుధవారం ఈ కంపెనీ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలు విడుదల చేసింది. రూపాయి బలపడటం, వేతనాల పెంపు, ఉద్యోగుల వలసల తదితర ప్రతికూలాంశాలతో నిర్వహణ మార్జిన్లు, ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. అయితే నికరలాభం మాత్రం అంచనాలకు అనుగుణంగానే నమోదైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు 2.50శాతం నష్టంతో రూ. 2081.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభంలో షేర్లు మరింత అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో 3శాతం పతనమైన రూ.2070.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఉదయం గం.9:45ని.లకు షేరు గత ముగింపు(రూ.2131.45)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.2111ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ 1784.00 రూ.2290.65లుగా నమోదయ్యాయి.
You may be interested
68.61 వద్ద ప్రారంభమైన రూపీ
Wednesday 10th July 2019రూపీ డాలర్ మారకంలో 6 పైసలు బలపడి 68.61 వద్ద బుధవారం ట్రేడింగ్‌లో ప్రారంభమైంది. డాలర్ బలపడడంతో గత సెషన్లో 18 పైసలు బలహీనపడి 68.84 ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. చమురు ధరలు తగ్గడంతో రూపీ బలపడి 68.67 వద్ద ముగిసింది.
65 డాలర్ల వద్ద బ్రెంట్ క్రూడ్
Wednesday 10th July 2019అమెరికా చమురు నిల్వలు వరుసగా నాలుగో వారం కూడా పడిపోవడంతో బుధవారం(జులై 10) చమురు ధరలు 1 శాతం మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.85 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్ 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 58.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 31 లక్షల బ్యారెల్లా చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే అది 81 లక్షల బ్యారెల్లు తగ్గి 4,614 లక్షల