STOCKS

News


టీసీఎస్‌ 2% డౌన్‌, మిశ్రమంగా ఐటీ షేర్లు!

Friday 11th October 2019
Markets_main1570772904.png-28822

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నప్పటికి, టీసీఎస్‌ క్యూ2 ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడం, రూపీ డాలర్‌ మారకంలో బలపడడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు మిశ్రమంగా ట్రేడవతున్నాయి. ఉదయం 11.10 సమయానికి నిప్టీ ఐటీ ఇండెక్స్‌​0.12 శాతం లాభపడి 15,112.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఇన్ఫోసిస్‌ 2.20 శాతం లాభపడి రూ. 800.25 వద్ద ట్రేడవుతుండగా, ఫలితాల ప్రభావంతో టీసీఎస్‌ 2.66 శాతం నష్టపోయి రూ. 1,951.15 వద్ద ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో నిట్‌(ఎన్‌ఐఐటీ) టెక్‌ 2.16 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.03 శాతం, మైండ్‌ ట్రీ 0.78 శాతం, జస్ట్‌ డైల్‌ 0.51 శాతం లాభపడి ట్రేడవుతుండగా, టెక్‌ మహింద్రా 1.05 శాతం, టాటా ఎలక్సిసీ 0.27 శాతం, విప్రో 0.21 శాతం, హెక్స్‌వేర్‌ 0.07 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.You may be interested

ఇండస్‌ఇండ్‌ షేరు టార్గెట్‌ తగ్గింపు!

Friday 11th October 2019

క్యు2లో ప్రొవిజన్లు పెరిగినట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రకటించడంతో బ్యాంకు షేరు టార్గెట్‌ధరను బ్రోకింగ్‌ సంస్థలు తగ్గించాయి. షేరుపై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలాఉన్నాయి... 1. ఎడెల్‌వీజ్‌: టార్గెట్‌ ధరను రూ. 2060 నుంచి 1793కు తగ్గించింది. చారిత్రక ట్రెండ్‌ కన్నా వృద్ధి బాగా క్షీణించింది. ఆస్తుల నాణ్యత ప్రస్తుతానికి బాగానే ఉన్నా, కొన్ని అకౌంట్లు సవాళ్లుగా మారాయి. పీఈ మల్టిపుల్స్‌ దిగివచ్చినందున టార్గెట్‌ను తగ్గించడం జరిగింది. 2. గోల్డ్‌మన్‌ సాక్స్‌: న్యూట్రల్‌

24 పైసలు బలపడిన రూపీ

Friday 11th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 24 పైసలు బలపడి 70.83 వద్ద ప్రారంభమైంది. అంతేకాకుండా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలహీనపడడంతో రూపీ డాలర్‌ మారకంలో 70.81 వద్ద ఒక వారం గరిష్ఠాన్ని తాకింది. కాగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.07 వద్ద ముగిసింది.    యురోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ ఎక్సిట్‌ ఒప్పందంపై పురోగతి ఉండడంతో పాటు యుఎస్‌-చైనా మధ్య గురువారం ప్రారంభమైన

Most from this category