News


స్వల్పంగా పెరిగిన టీసీఎస్‌ నికరలాభం

Friday 17th January 2020
Markets_main1579259009.png-30998

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ నికరలాభం స్వల్పంగా పెరిగింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 0.20 శాతం నామమాత్ర పెరుగుదలతో రూ. 8,105 కోట్ల నుంచి రూ. 8,118 కోట్లకు చేరింది. విశ్లేషకులు రూ. 8,180 కోట్ల మేర అంచనాలు వెల్లడించగా, ఈ అంచనాలను టీసీఎస్‌ దాదాపు అందుకుంది. కంపెనీ ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ. 37,338 కోట్ల నుంచి రూ. 39,854 కోట్లకు చేరింది. తాజా త్రైమాసికానికి షేరుకు రూ. 5 చొప్పున డివిడెండును కంపెనీ ప్రకటించింది. ఈ డివిడెండు చెల్లింపునకు జనవరి 25 రికార్డుతేదీకాగా, చెల్లింపు జనవరి 31న జరుగుతుంది. 



You may be interested

క్యూ3లో ఎల్‌ఐసీ ఈక్విటీ కొనుగోళ్లు ఇవే..

Friday 17th January 2020

దేశీయంగా పెద్ద ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లలో ఎల్‌ఐసీ కూడా ఒకటి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలను కూడా నిర్వహిస్తోంది. సుమారు రూ.31 లక్షల కోట్ల ఆస్తులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. పాలసీదారుల నుంచి ప్రీమియం రూపేణా వచ్చిన ఆదాయం నుంచి రిస్క్‌, పరిపాలనా చార్జీలను మినహాయించగా, మిగిలిన నిధులను సైతం ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటుంది. డిసెంబర్‌ క్వార్టర్‌(క్యూ3)లో ఎల్‌ఐసీ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ వివరాలు ఇవి...  డిసెంబర్‌ త్రైమాసికంలో

అమెజాన్‌ నుంచి ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!

Friday 17th January 2020

  అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ న్యూఢిల్లీ: ప్రపంచ ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ శుక్రవారం ఒక కీలక ప్రకటన చేసింది. 2025 నాటికి భారత్‌తో 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు  వెల్లడించింది. ‘‘మీ వ్యాపారంలో వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారని’’ అమెజాన్‌ ను ఉద్దేశించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ గురువారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..  అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో జెఫ్‌

Most from this category