News


టీసీఎస్‌? ఇన్ఫోసిస్‌?.. ఏది బెటర్‌?

Monday 15th April 2019
news_main1555312825.png-25136

శుక్రవారం ఐటీ దిగ్గజాల ఫలితాలతో క్యు4 సీజన్‌ ఆరంభమైంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ అంచనాల కన్నా మంచి ఫలితాలే ప్రకటించినా, మార్జిన్ల పరంగా టీసీఎస్‌ మెరుగ్గా కనిపించింది. ఈ నేపథ్యంలో రెండు కంపెనీల ఫలితాలు, షేరు భవితవ్యంపై బ్రోకరేజ్‌లు, నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి...
షేర్‌ఖాన్‌: రెండు కంపెనీల షేర్లకు కొనొచ్చు రేటింగ్‌. టీసీఎస్‌ టార్గెట్‌ రూ. 2400. ఇన్ఫోసిస్‌ టార్గెట్‌ రూ. 840. టీసీఎస్‌ ఫలితాలు ఇన్ఫీ కన్నా బాగున్నాయి. ఇన్ఫోసిస్‌ మార్జిన్ల పరంగా నిరాశపరిచింది. అయితే టీసీవీ(టోటల్‌కాంట్రాక్ట్‌ వాల్యూ) మెరుగుపడి 2020 మార్చి నాటికి రెవెన్యూగ్రోత్‌లో టీసీఎస్‌తో ఇన్ఫీ సరిసమానంగా నిలిచేందుకు అవకాశాలున్నాయి. దీంతో ఇరు కంపెనీల మధ్య వాల్యూషన్‌ అంతరం దిగివస్తుంది. 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: టీసీఎస్‌కు కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2385. టీసీఎస్‌ రెవెన్యూ, మార్జిన్లు, కొత్త డీల్స్‌ అన్నీ అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. 
ఆనంద్‌ రాఠీ: టీసీఎస్‌ ఎబిటా రూపీ రెవెన్యూగ్రోత్‌కు అనుగుణంగా ఉంది. రెవెన్యూ పర్‌ ఎంప్లాయి సైతం స్థిరంగా ఉంది. కానీ వాల్యూషన్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. 
సందీప్‌ సభర్వాల్‌: ఇన్ఫీ ఫలితాలు పేలవంగా ఉన్నాయి. రెవెన్యూ గైడెన్స్‌ నిరాశాపూరితంగా ఉంది. టీసీఎస్‌ ఫలితాలు బాగున్నాయి. అందువల్ల టీసీఎస్‌ షేరును ఎంచుకోవచ్చు.


ఆప్షన్లు ఏం చెబుతున్నాయి..
రెండు కంపెనీల ఫలితాల అనంతరం ఆప్షన్స్‌ను పరిశీలిస్తే టీసీఎస్‌ రూ. 2400, ఇన్ఫీ రూ. 800ను దాటకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సీరిస్‌ మొత్తం ఇన్ఫోసిస్‌ రూ. 700-800 మధ్య, టీసీఎస్‌ రూ. 1900- 2100 మధ్యన కదలాడే ఛాన్సులున్నాయి. సోమవారం షేర్ల కదలికలను చూస్తే టీసీఎస్‌ పైకి కానీ కిందకు కానీ 6-7 శాతానికి మించి కదలికలు చూపకపోవచ్చని, ఇన్ఫోసిస్‌ 7.6- 8.2 శాతానికి మించి కదలకపోవచ్చని చెబుతున్నారు. ఈ భావనతో ఎక్కువగా స్ట్రాంగిల్స్‌ వ్యూహం ఈ రెండు షేర్లపై ట్రేడర్లు అవలంబిస్తున్నారు. ఈ వ్యూహంలో వేర్వేరు ధరలకు చెందిన ఒక కాల్‌ను, ఒక పుట్‌ను విక్రయిస్తారు. టీసీఎస్‌ విషయంలో రూ. 1900 పుట్‌ను, రూ. 2100 కాల్‌ను, ఇన్ఫీ విషయంలో రూ. 700 పుట్‌ను, రూ. 800 కాల్‌ను విక్రయించారు. ఈ నాలుగు స్ర్టైక్‌ ప్రైస్‌ల వద్ద ఎక్కువ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ కనిపిస్తోంది. ఈ నెల డెరివేటివ్స్‌ సీరిస్‌ ముగిసేందుకు ఏడు ట్రేడింగ్‌ దినాలున్నాయి. 


TCS

You may be interested

3నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Monday 15th April 2019

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15:  ప్రైమరీ ఆర్టికల్స్‌, ఇంధన ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3నెలల గరిష్టానికి చేరుకుంది.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం  మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 3.18శాతంగా నమోదదైంది. గతేడాది (2018) మార్చిలో ఇది 2.74శాతంగా ఉంది. అంతక్రితం నెల 2.93 శాతంగా నమోదైంది. వాహన ఇంధనం, ఎల్‌పీజీ ధరలు పెరగడంతో ఇంధన, విద్యుత్తు ద్రవ్యోల్బణం 5.41శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరిలో

టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ

Monday 15th April 2019

కొద్దిరోజులుగా పరుగులు తీస్తున్న టాటా మోటార్స్‌ షేరు సోమవారం సైతం జోరు చూపించింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే 4 శాతం జంప్‌చేసింది. నేడు టాటామోటర్స్‌ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.216.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో షేరు ఇంట్రాడేలో దాదాపు 5శాతం ర్యాలీ చేసి రూ. 226.45ల గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.215.85)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.226.00ల

Most from this category