News


ఫలితాలకు ముందు నష్టాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌

Wednesday 9th October 2019
Markets_main1570602502.png-28782

దిగ్గజ ఐటీ కంపెనీల క్యూ2 ఫలితాలు ఇంకో రెండు రోజులలో రానుండడంతో ఐటీ షేర్లపై ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 11.50 సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.18 శాతం నష్టపోయి 15,067.00 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ షేర్లయిన  టీసీఎస్‌ 0.92     శాతం నష్టపోయి రూ. 2,028.85 వద్ద, ఇన్ఫోసిస్‌ 1.30 శాతం నష్టపోయి రూ. 779.30 వద్ద, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.96 శాతం నష్టపోయి రూ. 1,042.65 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో టాటా ఎలక్సిసీ 7.93 శాతం, హెక్స్‌వేర్‌ 2.32 శాతం, నిట్‌(ఎన్‌ఐఐటీ) టెక్‌ 1.12 శాతం, మైండ్‌ ట్రీ 0.18 శాతం, టెక్‌ మహింద్రా 0.01 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, జస్ట్‌డయల్‌ 0.29 శాతం, విప్రో 0.02 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. You may be interested

విషమ పరీక్ష దశలో నిఫ్టీ!

Wednesday 9th October 2019

దేశీయ మార్కెట్లు ప్రస్తుతం అత్యంత కీలక పరీక్షా దశలో ఉన్నాయని ప్రముఖ మార్కెట్‌ అనలిస్టు కునాల్‌ బోత్రా అభిప్రాయపడ్డారు. మార్కెట్లన్నీ ట్రెండ్‌ ఆధారంగా నడుస్తుంటాయని, ప్రతి ట్రెండ్‌కు ప్రత్యేకత ఉంటుందని, ప్రతి ట్రెండ్‌లో కొత్త ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వస్తుంటారని చెప్పారు. ట్రెండ్‌ ఏదైనా సెంటిమెంట్‌ ఆధారంగానే కొనసాగుతుందని, కానీ ప్రతి ట్రెండ్‌కు ఒక ప్రత్యేక ప్రవర్తనా విధానం ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రత్యేక ప్రవర్తనా విధానాన్ని టెక్నికల్‌ ఇండికేటర్ల ఆధారంగా

58 డాలర్ల దిగువకు చమురు!

Wednesday 9th October 2019

  యుఎస్-చైనా మధ్య గురువారం ప్రారంభం కానున్న వాణిజ్య చర్చలలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.44 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.41 శాతం పడిపోయి బారెల్‌ 58 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.49 శాతం పడిపోయి బారెల్‌ 52.37 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‍కాగా యుఎస్‌-చైనా ప్రతినిధులు

Most from this category