News


టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ కొత్త రికార్డులు

Tuesday 3rd September 2019
Markets_main1567484388.png-28157

ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో మంగళవారం ట్రేడింగ్‌లో రూపీ డాలర్‌ మారకంలో 72 దిగువకు క్షీణించింది. రూపీ క్షీణించడంతో ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు వాటి జీవితకాల రికార్డుస్థాయల్ని తాకడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 9.41 సమయానికి 0.66 శాతం లాభపడి 16,115.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టీసీఎస్‌ గత రికార్డుస్థాయి అయిన రూ. 2,293 స్థాయిని తాకగా, ఇన్ఫోసిస్‌ ఇటీవలి రూ.815 రికార్డుస్థాయిని దాటి కొత్త రికార్డును నెలకొల్పింది. టీసీఎస్‌ 0.93 శాతం లాభపడి రూ. 2,280.65 వద్ద ట్రేడవుతుండగా, ఇన్ఫోసిస్‌ 0.20 శాతం లాభపడి రూ. 816.55 వద్ద ట్రేడవుతోంది. వీటితో పాటు ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.33 శాతం లాభపడి రూ. 1,114.95 వద్ద, ఒరాకిల్‌ (ఓఎఫ్‌ఎస్‌ఎస్‌) 0.71 శాతం నష్టపోయి రూ. 3,059.05 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో టెక్‌ మహింద్రా 2.57 శాతం, మైండ్‌ ట్రీ 1.94 శాతం, టాటా ఎలక్సి 0.75 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  ఇన్ఫీ బీమ్‌ 2.09 శాతం, నిట్‌(ఎన్‌ఐఐటీ) టెక్‌ 0.88 శాతం,  విప్రో 0.04 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.You may be interested

అమ్మకాల క్షీణతతో ఆటో షేర్ల రివర్స్‌ గేర్‌..!

Tuesday 3rd September 2019

అగస్ట్‌లో వాహనరంగ అమ్మకాలు భారీగా పడిపోవడంతో అటోరంగ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. క్రితం నెలలో అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టడం, పలు బ్రోకరేజ్‌ సంస్థలు అటోరంగ షేర్లపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 2శాతం నష్టపోయింది. శనివారం పలు అటోరంగ కంపెనీలు ఆగస్ట్ మాసపు అమ్మకాలు

బ్యాంక్‌ నిఫ్టీ క్రాష్‌

Tuesday 3rd September 2019

మార్కెట్‌ భారీపతనంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 27000 స్థాయికి కోల్పోయింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,239.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులకు తోడు, 10 పీఎస్‌యూ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 4 పెద్ద బ్యాంకుల ఆవిర్భావానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపడంతో బ్యాంకింగ్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌,

Most from this category