News


టీసీఎస్‌ లాభాల్లో- ఇన్ఫీ నేలచూపు

Wednesday 8th January 2020
Markets_main1578462791.png-30760

రుపీ ఎఫెక్ట్‌?
లాభాల్లో ఎన్‌ఐఐటీ టెక్‌, టీసీఎస్‌
ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌, టాటా ఎలక్సీ డీలా

అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు, బంగారం ధరలు జోరందుకున్నాయి. దీంతో దేశీ కరెన్సీ మరోసారి డీలా పడింది. డాలరుతో మారకంలో 72 మార్క్‌ను తాకింది. ఫలితంగా మార్కెట్లు బలహీనపడ్డాయి. అయితే తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ అమ్మకాలకు ఎదురీదుతూ లాభపడింది. తదుపరి కొంత బలహీనపడింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ పుంజుకోగా.. ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌, టాటా ఎలక్సీ డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం..

అటూఇటుగా
ఉదయం​11 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ 1.2 శాతం లాభపడి రూ. 2232 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2238 వరకూ ఎగసింది. ఈ బాటలో నిట్‌ టెక్‌ షేరు 1.6 శాతం పెరిగింది. రూ. 1682కు చేరింది. తొలుత గరిష్టంగా రూ. 1692ను సైతం అధిగమించింది. అయితే ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 712 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 729 వద్ద గరిష్టాన్నీ, రూ. 711 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక టాటా ఎలక్సీ 0.75 శాతం నష్టంతో రూ. 821 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు ఇంట్రాడేలో రూ. 826-813 మధ్య ఊగిసలాడింది. కాగా.. ఈ నెల 10న ఇన్ఫోసిస్‌ మూడో త్రైమాసిక(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలను ప్రకటించనుంది.



You may be interested

నష్టాల బాటలో అటో షేర్లు

Wednesday 8th January 2020

మార్కెట్‌ పతనంలో అటోరంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 7,921.65 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇండెక్స్ అటో రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఒకదశలో ఇండెక్స్‌ 1.25శాతం నష్టపోయి 7,900.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(8,002.50)తో పోలిస్తే 1.04శాతం నష్టంతో 7,919.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు ప్లస్‌

Wednesday 8th January 2020

యస్‌ బ్యాంక్‌, గోవా కార్బన్‌ నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌ హెచ్చరించిన విధంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్‌ మిసైళ్లతో దాడి చేసిన వార్తలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ఆపై బలహీనంగా కదులుతున్నాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లు క్షీణించి 40,750 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 44 పాయింట్లు తక్కువగా 12,008 వద్ద కదులుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆందోళనకు లోనైన

Most from this category