News


టాక్స్‌ భయాలతో షార్ట్స్‌కు దిగిన ఎఫ్‌ఐఐలు

Thursday 11th July 2019
Markets_main1562826327.png-26983

నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ ఫ్యూచర్లలో విదేశీ సంస్థాగత మదుపరులు(ఎఫ్‌ఐఐ) నికర విక్రయదారులుగా మారారు. కార్పొరేట్‌ నిర్మితిలేని ట్రస్ట్‌ స్ట్రక్చర్‌ ఉన్న ఎఫ్‌ఐఐలు అధిక పన్నులను ఎదుర్కోవాల్సి వస్తుందని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు దిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇండెక్స్‌ ఫ్యూచర్లలో జూలై4న దాదాపు 41వేల వరకు లాంగ్స్‌ ఉన్న ఎఫ్‌ఐఐలు జూలై9కి తమ లాంగ్‌ పొజిషన్లను 15745కు తగ్గించుకున్నారు. అధిక పన్నుతో పాటు లిస్టెడ్‌ కంపెనీల బైబ్యాక్‌పై పన్ను సైతం విదేశీ మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని షేర్‌ఖాన్‌ నిపుణుడు రోహిత్‌ శ్రీవాస్తవ వివరించారు. రెండురోజులుగా ఎఫ్‌ఐఐలు క్యాష్‌మార్కెట్లో నికర అమ్మకాలు జరుపుతూ, తదనుగుణంగా ఫ్యూచర్స్‌లో నికర షార్టింగ్‌ జరుపుతున్నాయని తెలిపారు. బడె​‍్జట్‌ ముందు స్థాయిల నుంచి సూచీలు స్వల్పకాలంలో మంచి పతనం చూసాయి. ఇదే సమయంలో సూచీల ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ బాగా పెరిగింది. ధర క్షీణిస్తూ, ఓఐ పెరగడం బేరిష్‌బెట్స్‌ పెరగడానికి సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. జూలై 25 ఎక్స్‌పైరీ ఉన్న నిఫ్టీ ఆప్షన్స్‌ పుట్‌కాల్‌ నిష్పత్తి ప్రస్తుతం 0.87 వద్ద ఉంది దీన్ని బట్టి కాల్స్‌ ఎక్కువగా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. 
 



You may be interested

11400 దిగువన 11100 పాయింట్ల వరకు పతనం!

Thursday 11th July 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా నిఫ్టీ తన ఇటీవల కాలపు రేంజ్‌ నుంచి బడ్జెట్‌ తర్వాత బ్రేక్‌డౌన్‌ చూపింది. అప్పటి నుంచి ఆరేంజ్‌ దిగువ అవధి 11625 పాయింట్ల కిందనే కదలాడుతోంది. బుధవారం డైలీ చార్టుల్లో ట్రెండ్‌లైన్‌ నుంచి కూడా బ్రేక్‌డౌన్‌ చూపినట్లు కనపడుతోంది. ఇవన్నీ మార్కెట్‌ వర్గాల్లో పెరుగుతున్న నిరాశాధోరణికి నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్‌ రోజు చార్టుల్లో ఏర్పడ్డ గ్యాప్‌ను పూరించేవరకు ఈ పతనం తప్పకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. గత

తగ్గిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు

Thursday 11th July 2019

జూన్‌లో 17.54 శాతం క్షీణత న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు మరింత నీరసించాయి. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం పీవీ అమ్మకాలు 17.54 శాతం తగ్గి 2,25,732 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది జూన్‌ విక్రయాలు 2,73,748 యూనిట్లు కాగా, ఈసారి అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దేశీ కార్ల విక్రయాలు 24.97 శాతం క్షీణించి 1,39,628 యూనిట్లుగా వెల్లడైంది. 2018 ఏడాదిలో ఇవి 1,83,885 యూనిట్లుగా

Most from this category