News


ట్యాక్స్‌ తగ్గింపుతో లాభపడే రంగాలివే!

Saturday 21st September 2019
Markets_main1569060812.png-28472

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి(సెస్‌, సర్‌చార్జీలను మినహాయించి) తగ్గించింది. కాగా ఈ చర్య వలన దేశీయ కంపెనీల లాభాల్లో 11 శాతం వృద్ధి వుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉద్దీపనం వలన స్వల్ప, మధ్య కాలానికి గాను ఇండియా ఈక్విటీ మార్కెట్లు ఆకర్షిణీయంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఇండియాలో వివిధ రకాల ట్యాక్స్‌ ప్రొవిజన్స్‌ ఉండడం వలన ట్యాక్స్‌ తగ్గింపు ప్రభావం వివిధ రంగాలపై వేరువేరుగా ఉండే అవకాశం ఉంది. 

తయారీ రంగం:
   భారత ఆర్థిక వ్యవస్థను సేవారంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. దేశ జీడీపీలో దీని పాత్ర  సగానికి పైగా ఉంటుంది. ఇండియా జీడీపీలో తయారి రంగం వాటా 18 శాతంగా ఉంది. అధికంగా ఉద్యోగ కల్పనకు కారణమయ్యే ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. కానీ వినియోగ డిమాండ్‌ తగ్గడం, బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా గత ఏడాది కాలం నుంచి తయారిరంగం మందగమనాన్ని ఎదుర్కొంటుంది. ఆర్థిక సంవత్సరం 2019 మొదటి త్రేమాసికంలో దేశ తయారి రంగం వృద్ధి 12 శాతం ఉండగా, అది ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికం నాటికి 1 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి దేశంలో తయారిరంగం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. 
   ప్రభుత్వం తీసుకున్న ట్యాక్స్‌ తగ్గింపు చర్యల వలన వ్యవస్థలో డిమాండ్‌ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుంది. మిగిలిన నిధులతో కంపెనీలు, తిరిగి పెట్టుబడులు పెట్టడం, ధరలను తగ్గించి డిమాండ్‌ను పెంచడం, రుణాలను చెల్లించడం వంటి వివిధ చర్యలను తీసుకునే అవకాశం ఉంది.

ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌):
కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వాల్యుమ్‌లు వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. ట్యాక్స్‌ తగ్గింపు వలన కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుంది. ఈ నిధులతో కంపెనీలు రాయితీలు, ఆఫర్‌లను ప్రకటించి వినియోగదారులను ఆకర్షించడానికి వీలుంటుంది. ఫలితంగా వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుతుంది. ఆర్థిక సంవత్సరం 2019 సంఖ్యల ఆధారంగా..నిఫ్టీలో నమోదైన ఐటీసీ, నెస్లే, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌(హిందుస్థాన్‌ యూనిలీవర్‌) వంటి కంపెనీలు చెల్లించే ట్యాక్స్‌ను 29-35 శాతం పరిధి నుంచి 25 శాతానికి తగ్గించడంతో, ఈ కంపెనీలు  మొత్తంగా రూ. 2,000 కోట్ల లబ్దిని పొందుతాయి.

క్రెడిట్‌ సైకిల్‌ పుంజుకునే అవకాశం..
అక్టోబర్‌ 1, 2019 తర్వాత ఏర్పాటు చేసే కొత్త తయారిరంగ కంపెనీలు, ఆదాయ పన్ను 15 శాతం చెల్లించే విధంగా ప్రభుత్వం నిబంధనను తీసుకు వచ్చింది. దీంతో 2023 మార్చి నాటికి ఉత్పత్తిని తీసుకువచ్చే విధంగా అనేక కంపెనీలు చర్యలను వేగవంతం చేయవచ్చు. ఇది ప్రైవేట్‌ కంపెనీల మూలధన వ్యయం పెరగడానికి సహాయపడుతుంది. ఫలితంగా రుణ వృద్ధి పెరిగి బ్యాంకులు లాభపడడానికి అవకాశం​ఉంది. కానీ పన్ను రేటును తగ్గించడం వలన ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇది వడ్డీ రేట్లపై ప్రభావం చూపవచ్చు.     
  మొత్తంగా ప్రభుత్వం తీసుకున్న ట్యాక్స్‌ తగ్గింపు చర్య, బ్యాంకింగ్‌ సెక్టార్‌పై మిశ్రమ ప్రభావాన్ని చూపతుంది. కెమికల్‌, ఫార్మా ఏపీఐ(యాక్టివ్‌ ఫార్మాసుటికల్‌ ఇంగ్రేడియంట్స్‌) వ్యాపారాలలోకి పెట్టుబడులు పెరగడానికి ఈ ట్యాక్స్‌ తగ్గింపు చర్య ఉపకరిస్తుంది. ఈ వ్యాపారాలలోకి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.

ఆటోరంగం డిమాండ్‌ పెరుగుతుంది..
దేశీయ ఆటోరంగం దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనది. ఇది దేశ జీడీపీలో 7.5 శాతం వాటాను, తయారిరంగ జీడీపీలో 49 శాతం వాటాను కలిగి ఉంది. కానీ ఈ రంగం గత ఏడాది కాలం నుంచి అనేక సమస్యలతో సతమతమవుతోంది. రిటైల్‌ ఫైనాన్స్‌ అందుబాటులో లేకపోవడం, లిక్విడిటీ కొరత, ఆర్థిక మందగమనం వంటి అంశాల వలన ఆటో రంగంలో డిమాండ్‌ తీవ్రంగా దెబ్బతింది. డిమాండ్‌ తగ్గాడానికి ఈ కారణాలతోపాటు రక్షణ నిబంధనలను అమలు చేయడం, దీర్ఘకాల ఇన్సురెన్స్‌ పాలసీలు కూడా ప్రభావం చూపాయి. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఆటో రంగ కంపెనీలు లాభదాయకత పెరుగుతుంది. అన్నిటికన్నా రానున్న పండుగ సీజన్‌లో వినియోగ దారులను ఆకర్షించడానికి ఆటో​ కంపెనీలు రాయితీలను, ఉచిత ఆఫర్‌లను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఈ రంగంలో డిమాండ్‌ పెరుగుతుంది. దీంతోపాటు కంపెనీలకు నిధుల లభ్యత పెరగడంతో ఈ కంపెనీలు మరింతా పెట్టుబడులను పెట్టగలవు.



You may be interested

పండుగ సీజన్‌పై పసిడి ఆశలు

Saturday 21st September 2019

దేశీయ బులియన్‌ మార్కెట్‌ పండుగ సీజన్‌పై పసిడి ఆశలు పెట్టుకుంది. సాధారణంగా భారత్‌లో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో  దసరా, దీపావళి లాంటి సంప్రదాయ పండుగుల సీజన్‌తో పాటు పెళ్ళిళ్ల కారణంగా ఈ సీజన్‌లో పసిడికి భారీ డిమాండ్‌ నెలకొంటుంది. డిమాండ్ సీజన్లోకి ప్రవేశించినప్పుడు పసిడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నవంబర్‌ చివరి నాటికి పసిడి ఫ్యూచర్‌ 10గ్రాముల పసిడి ధర రూ.41,800 చేరుకునే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు

తెరపైకి ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు: 18 డాలర్లు పెరిగిన పసిడి

Saturday 21st September 2019

అమెరికా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరిగింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను చైనా మధ్యలోనే రద్దు చేసుకున్నట్లు కన్పిస్తోందని అమెరికా ప్రతినిధులు తెలిపారు. ఇరాన్‌ తాజాగా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసేసరికి ఔన్స్‌ పసిడి ధర 18డాలర్ల లాభంతో 1,524.05 వద్ద  స్థిరపడింది. దీంతో సెప్టెంబర్‌లో తొలిసారిగా పసిడి ఈ

Most from this category