News


పన్ను తగ్గింపుతో తక్షణ వృద్ధిని ఆశించలేం : మూడీస్‌

Saturday 21st September 2019
Markets_main1569063477.png-28474

కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గిం‍చడం, దేశ ద్రవ్యలోటు ఒత్తిళ్లు పెరగడానికి కారణమవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ శనివారం తెలిపింది.  ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. తగ్గిన ట్యాక్స్‌ వలన దేశంలో పెట్టుబడులు పెరిగి, పన్నుల సేకరణ వృద్ధి చెందుతుందని, ఫలితంగా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం భర్తీ అవుతుందని తాము అంచనావేయడం లేదని తెలిపింది. ‘ట్యాక్స్‌రేట్‌ తగ్గించడంతో ఇండియా, వ్యాపారం విషయంలో ఆసియాలో మిగిలిన దేశాలతో పోటిపడడానికి అవకాశం ఏర్పడింది. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉండడం, కార్పోరేట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండడం, ఫైనాన్సియల్‌ సెక్టార్‌లో రుణాల లభ్యత తగ్గడం వంటి కారణాల వలన స్వల్పకాల వృద్ధి ప్రభావితమయ్యే అవకాశం ఉంది’ అని తెలిపింది. ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన కంపెనీలు ఆదాయం పెంచుకోడానికి వీలుంటుంది. ‘ కానీ ఈ చర్య వలన ప్రభుత్వం ద్రవ్యలోటు ఒత్తిడిని ఎదుర్కొవలసి వస్తుంది’ అని వివరించింది. కాగా కమోడిటీ, ఐటీ కంపెనీలు ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన అధికంగా లాభపడే అవకాశం ఉందని అభిప్రాయపడింది.  ‘ప్రభుత్వం, ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.3 శాతం నిర్ణయించింది. అప్పటికే ప్రభుత్వం అధిక పన్ను సేకరణను దృష్ఠిలో పెట్టుకుంది’ అని మూడీస్‌ తెలిపింది. ప్రభుత్వం, జూలైలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో, మొత్తం కార్పొరేట్ పన్ను ఆదాయాన్ని రూ .7.7 లక్షల కోట్లు (జీడీపీలో సుమారు 4 శాతం)గా  అంచనా వేసింది. కానీ కార్పొరేట్ పన్ను రేటు తగ్గడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఈ ఆదాయం సుమారు రూ .1.45 లక్షల కోట్లు తగ్గనుంది. ‘కార్పొరేట్ పన్ను ఆదాయం తగ్గినప్పటికి ఆర్‌బీఐ మిగులు నిధులు ప్రభుత్వానికి అందనుండడంతో ద్రవ్యలోటు ఒత్తిళ్లు కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది’ అని ఈ రేటింగ్‌ సంస్థ అభిప్రాయపడింది.



You may be interested

ఎఫ్‌ఐఐల నికర కొనుగోళ్లు రూ.36 కోట్లే..!

Saturday 21st September 2019

కేంద్రం ప్రకటించిన కార్పోరేట్‌ పన్ను కోతకు మురిసిన మార్కెట్‌ శుక్రవారం భారీగా లాభపడింది. ట్రేడింగ్‌ ఆద్యంతం ఇటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లలతో పాటు, అటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) కోనుగోళ్లతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.6.82 లక్షల కోట్ల మేర పెరిగింది. సాదారణంగా మార్కెట్‌లో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరిగినపుడు ఎఫ్‌పీఐ కొనుగోళ్లదే పైచేయి ఉంటుంది. అయితే నిన్నటి ట్రేడింగ్‌లో ఎఫ్‌పీఐలు నికర కొనుగోళ్లు కేవలం రూ.36 కోట్లుగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఈ

పండుగ సీజన్‌పై పసిడి ఆశలు

Saturday 21st September 2019

దేశీయ బులియన్‌ మార్కెట్‌ పండుగ సీజన్‌పై పసిడి ఆశలు పెట్టుకుంది. సాధారణంగా భారత్‌లో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో  దసరా, దీపావళి లాంటి సంప్రదాయ పండుగుల సీజన్‌తో పాటు పెళ్ళిళ్ల కారణంగా ఈ సీజన్‌లో పసిడికి భారీ డిమాండ్‌ నెలకొంటుంది. డిమాండ్ సీజన్లోకి ప్రవేశించినప్పుడు పసిడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నవంబర్‌ చివరి నాటికి పసిడి ఫ్యూచర్‌ 10గ్రాముల పసిడి ధర రూ.41,800 చేరుకునే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు

Most from this category