News


టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 13 శాతం జంప్‌

Saturday 26th October 2019
Markets_main1572073893.png-29164

మార్కెట్‌ అంచనాల్ని మించి ఫలితాల్ని వెల్లడించడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో టాటా మోటార్స్‌ అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) 13 శాతం పెరిగి 10.49 డాలర్ల వద్ద ముగిసింది. ఈ కంపెనీకి సంబంధించిన ఒక్కో ఏడీఆర్‌...ఇక్కడి 5 షేర్లకు సమానం. టాటా మోటార్స్‌ తాజా ఏడీఆర్‌ ధర ప్రకారం ఆదివారం దీపావళి సందర్భంగా జరగబోయే మూరత్‌ ట్రేడింగ్‌లో ఈ షేరు రూ.148 సమీపంలో ప్రారంభమయ్యే ఛాన్స్‌ వుంది. శుక్రవారం ఇక్కడ టాటా మోటార్స్‌ షేరు 5 శాతం పతనమై రూ.127 వద్ద ముగిసింది. మన స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత టాటా మోటార్స్‌ వెల్లడించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఆశ్చర్యపర్చిన కారణంగా అమెరికాలో ఏడీఆర్‌ పెద్ద ర్యాలీ జరిపింది. ఇక్కడ శుక్రవారంనాటి ముగింపుతో పోలిస్తే 17 శాతం లాభంతో రూ. 148 వద్దకు టాటా మోటార్స్‌ షేరు పెరగవచ్చు. మరో నాలుగు రోజుల్లో అక్టోబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు ముగియనున్నందున, టాటా మోటార్స్‌ కౌంటర్లో షార్ట్‌ కవరింగ్‌ కారణంగా రూ. 148 స్థాయి నుంచి మరింత పెరగడంగానీ, బుల్స్‌ ఆఫ్‌లోడింగ్‌ ఫలితంగా ఆ స్థాయి నుంచి మరింత తగ్గడంగానీ జరగవచ్చు. 
మిగిలిన ఏడీఆర్‌లూ లాభాల్లోనే....
ఈ శనివారం ఫలితాలు వెల్లడించనున్న ఐసీఐసీఐ బ్యాంక్, వివాదంలో చిక్కుకున్న ఇన్ఫోసిస్‌లతో సహా అమెరికాలో లిస్టయిన ఇతర ప్రధాన ఏడీఆర్‌లు సైతం శుక్రవారం రాత్రి లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2 శాతం లాభపడి 13.03 డాలర్ల వద్ద ముగిసింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. ఈ ధర ప్రకారం ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు రూ. 461 వద్ద ప్రారంభంకావాల్సివుంటుంది. అయితే కొద్ది నెలలుగా అమెరికా ఏడీఆర్‌తో పోలిస్తే ఇండియాలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 1.5 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. శుక్రవారం ఈ షేరు 3 శాతం పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి రూ. 469 వద్ద ముగిసింది. అంటే ఇక్కడి ముగింపు ధరకు దాదాపు సమానంగానే ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ ముగిసినట్లు. ఈ రెండు ముగింపులకు సంబంధంలేకుండా  శనివారం వెల్లడయ్యే ఫలితాలకు అనుగుణంగా మూరత్‌ ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ కదలవచ్చు. తదుపరి సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఏడీఆర్‌ కూడా ట్రేడ్‌కావచ్చు. దీపావళి సందర్భంగా సోమవారం ఇక్కడి స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు.
ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 3 శాతం జంప్‌...
తప్పుడు లాభాల్ని, మార్జిన్లను చూపిస్తున్నారన్న ఆరోపణల వివాదం కారణంగా గత వారం రోజులుగా భారీ పతనాన్ని చవిచూసిన ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ గత రాత్రి 3 శాతం లాభంతో 9.20 డాలర్ల వద్ద ముగిసింది. ఇది ఇండియాలో ఇన్ఫోసిస్‌ షేరుకు రూ. 651 ధరతో సమానం. శుక్రవారం ఇక్కడ ఇన్ఫోసిస్‌ షేరు రూ. 637 వద్ద ముగిసింది. ఈ కారణంగా ఇక్కడి తదుపరి ట్రేడింగ్‌ రోజున ఇన్ఫోసిస్‌ 2 శాతం లాభంతో మొదలయ్యే అవకాశం వుంది. ఈ కంపెనీకి చెందిన ఏడీఆర్‌తో పోలిస్తే షేరు ధర కొద్దిపాటి డిస్కౌంట్‌తోగానీ, లేదా కాస్త ప్రీమియంతో గానీ ట్రేడవుతూ వుంటుంది. 
మిగిలిన ప్రధాన ఏడీఆర్‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌  60 డాలర్ల వద్ద ముగిసింది. ఇది ఈ షేరుకు రెండు నెలల గరిష్టస్థాయి. విప్రో ఏడీఆర్‌ 2.5 శాతం లాభంతో 3.94 డాలర్ల వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ ఏడీఆర్‌ స్వల్ప పెరుగుదలతో 39.25 డాలర్ల వద్ద ముగిసాయి. 
 



You may be interested

మరోసారి బ్రెగ్జిట్‌ గడువును పొడిగించిన ఈయూ

Saturday 26th October 2019

బ్రెగ్జిట్‌ (యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) డెడ్‌లైన్‌ను ఈయూ(యురోపియన్‌ యూనియన్‌) మరోసారి పొడిగించింది. కానీ బ్రిటన్‌లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ పొడిగింపునకు ఎటువంటి తేదీని ప్రకటించలేదు. కాగా గత వారం ప్రధాని జాన్సన్‌ బోరిస్‌ బ్రెగ్జిట్‌ డీల్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌లోకి వచ్చినప్పటికి, మెజార్టీ ఆమోదం పొందలేకపోయిన విషయం తెలిసిందే. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల అంబాసిడర్‌లు బ్రెగ్జిట్‌ ఒప్పందం గడువు పెంచడంపై శుక్రవారం సమావేశమై గడువు పొడిగించాలని నిర్ణయించారు. కాగా

‘‘ముహూరత్‌ ట్రేడింగ్‌’’ గురించి మీకు తెలుసా..!?

Saturday 26th October 2019

‘‘ముహూరత్‌ ట్రేడింగ్‌’’... దలాల్‌ స్ట్రీల్‌ వర్గాలకు పరిచయం అవసరం లేని పదం. అయితే కొత్తగా స్టాక్‌ మార్కెట్‌ను అనుసరించే వారు,  సాధారణ పాఠకులు మాత్రం ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ గురించి కాస్త తెలుసుకోవాల్సిందే. రేపు దీపావళి సందర్భరంగా ప్రత్యేకమైన ముహురత్‌ ట్రేడింగ్‌ జరగనుంది. అసలు మూహరత్‌ ట్రేడింగ్‌ అంటే ఏమిటి, ఎందుకు, ఎ‍ప్పుడు జరుగుతుందనే అనే కీలకాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.... మూహరత్‌ ట్రేడింగ్‌ అంటే ఏమిటి? ప్రతి ఏడాది దీపావళి పండుగ పర్వదినాన

Most from this category