News


లాభాల్లో టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్లు

Friday 13th December 2019
news_main1576214476.png-30206

6శాతం ర్యాలీ చేసిన టాటామోటర్స్‌ 
4శాతం పెరిగిన టాటాస్టీల్‌ షేరు


ట్రేడింగ్‌ ప్రారంభంలోనే టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్ల హావా కొనసాగుతుంది. టాటామోటర్స్‌ షేరు 6శాతం, టాటాస్టీల్‌ షేరు 4శాతం పెరిగాయి. బ్రిటన్‌లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే మరోసారి ఓటర్లు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ షేర్ల ర్యాలీకి కారణమవుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందకు (బ్రెగ్జిట్‌)కు అనుకూలం. టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ కంపెనీలు బ్రిటన్‌లో ఉండడంతో బ్రెగ్జిట్‌ ఒప్పందం ఈ కంపెనీలకు మేలు చేస్తుందన్న అంచనాలతో ఈ షేర్లకు మార్కెట్‌ ప్రారంభంలోనే డిమాండ్‌ పెరిగింది. నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో టాటా మోటర్స్‌ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, టాటా స్టీల్‌ షేరు 3స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.


టాటా మోటర్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.177.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడే 6శాతం ఎగిసి రూ.183.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:30ని.లకు షేరు క్రితం ముగింపు (రూ.173.35)తో పోలిస్తే 4.53శాతం లాభంతో రూ.181.20  వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00, రూ.239.35లుగా నమోదయ్యాయి. 


టాటా స్టీల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.430.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడే 4శాతం లాభపడి రూ.434.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:30ని.లకు షేరు క్రితం ముగింపు (రూ.418.70)తో పోలిస్తే 3.10శాతం లాభంతో రూ.431.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.320.35, రూ.561.65లుగా నమోదయ్యాయి.


ఇక మొత్తం 650 సీట్లకు గాను అధికార కన్జర్వేటివ్‌ పార్టీ(టోరీస్)కి 368 స్థానాలు వస్తాయని, ప్రతిపక్ష లేబర్ పార్టీకి 191 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. పూర్తి ఎన్నికల ఫలితాలు శుక్రవారం(డిసెంబర్-13,2019)సాయంత్రానికి వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాక డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ మూడు శాతం పెరిగింది. ఈ ఏడాది మే నుంచి ఇదే అత్యధిక పెరుగుదల. యూరోతో పోలిస్తే మూడున్నరేళ్ల గరిష్ఠానికి పౌండ్ విలువ ఎగబాకింది. 



You may be interested

సౌదీ ఆరామ్‌కో @ 2 ట్రలియన్‌ డాలర్ల కంపెనీ

Friday 13th December 2019

ప్రపంచంలో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీ ఇదే  దుబాయ్‌: సౌదీ చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో కంపెనీ మార్కెట్‌ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లు(2 లక్షల కోట్ల డాలర్లు-రూ.142 లక్షల కోట్లు)దాటేసింది. ప్రపంచంలో అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీ ఇదే. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో యాపిల్‌ కంపెనీ రెండో స్థానంలో ఉంది. స్టాక్‌ మార్కెట్లో లిస్టైన తొలి రోజు 1.8 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌

యూఎస్‌- చైనా ట్రేడ్‌ డీల్‌కు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌

Friday 13th December 2019

చైనా, అమెరికా మధ్య ఫేజ్‌ 1 ట్రేడ్‌డీల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 15న చైనాపై విధించాలిన్న కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావు. గురువారం ఈ ట్రేడ్‌ డీల్‌పై ట్రంప్‌ తన న్యాయ సలహాదారులతో చర్చించారు. యూఎస్‌ వ్యవసాయోత్పత్తులను చైనా మరింతగా కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని సదరు వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రతిగా చైనాపై ప్రస్తుతం విధించిన కొన్ని

Most from this category