News


ఫలితాల ప్రభావం..నష్టాల్లో టాటా స్టీల్‌

Thursday 8th August 2019
Markets_main1565240232.png-27622

ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో టాటా స్టీల్‌ ఆదాయ వృద్ధి పడిపోవడంతో పాటు, నికర లాభం 64.3 శాతం క్షీణించి రూ. 693 కోట్లుగా నమోదు కావడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం నష్టాల్లో ట్రేడవుతోంది. క్యూ1 ఫలితాలతో పాటు, సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజి సంస్థ ఈ కంపెనీ స్టాకుపై ‘సెల్‌’ కాల్‌ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ. 395 నుంచి రూ.320 తగ్గించడం కూడా ఈ షేరుపై ప్రభావం చూపింది. టాటా స్టీల్‌ లి. షేరు గురువారం ఉదయం 10.04 సమయానికి 3.51 శాతం నష్టపోయి రూ. 368.50  వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు గత సెషన్‌లో రూ. 381.90 వద్ద ముగిసింది. 
  టాటా స్టీల్‌ బుధవారం తన జూన్‌ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.  ఏడాది ప్రాతిపదికన నికర లాభం 64.3 శాతం క్షీణతతో రూ .693 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 1,940.8 కోట్లుగా నమోదయ్యింది. ఆదాయ వృద్ధి , ఇతర ఆదాయాలు తగ్గడంతో నికర లాభం తీవ్రంగా ప్రభావితమయ్యింది. దేశియ, యూరోప్‌ మార్కెట్లలో మందగమనం వలన జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం 1.27 శాతం మాత్రమే పెరిగి రూ .35,947.1 కోట్లకు చేరుకుంది. ఈ ఆదాయం టాటా స్టీల్ బీఎస్‌ఎల్‌ (ఎన్‌సిఎల్‌టి ఆధ్వర్యంలో భూషణ్ స్టీల్ కొనుగోలు చేసింది) 105.5 శాతం పెరిగి క్యూ 1 లో రూ .4,332.73 కోట్లకు చేరుకోవడంతో టాటా స్టీల్‌ ఆదాయానికి మద్ధతు లభించింది. టాటా స్టీల్ ఇండియా వ్యాపారం దాదాపు 2 శాతం క్షీణించి రూ .16,091 కోట్లకు, టాటా స్టీల్ యూరప్ ఆదాయం 11.77 శాతం తగ్గి రూ .14,495 కోట్లకు చేరుకుంది.



You may be interested

రుణాలు ఇక పండగే..!

Thursday 8th August 2019

7 శాతం నుంచి 6.9 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు వరుసగా నాలుగో విడత రెపో రేటుకు కోత 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ 5.4 శాతానికి దిగొచ్చిన రెపో రేటు 5.15 శాతానికి రివర్స్‌ రెపో రేటు సర్దుబాటు ధోరణి కొనసాగింపు డిమాండ్‌, పెట్టుడులు పెంచడమే ప్రాధాన్యం: ఎంపీసీ ముంబై: క్షీణిస్తున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్‌ ఆర్‌బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది..! బుధవారం వెల్లడైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది.

పసిడిలో స్వల్ప లాభాల స్వీకరణ

Thursday 8th August 2019

ప్రపంచ మార్కెట్లో గరిష్ట స్థాయిల వద్ద పసిడి ఫ్యూచర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో 16డాలర్లు నష్టపోయింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కారణంగా అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 35.40 డాలర్లు లాభపడి 1,519.60 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో నేడు ఆసియాలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 16డాలర్లు మేర క్షీణించి 1,503.75

Most from this category