News


4 శాతం లాభపడిన టాటాస్టీల్‌

Wednesday 19th June 2019
Markets_main1560922497.png-26400

గత నాలుగు సెషన్‌లలో నష్టపోయిన టాటా స్టీల్‌ బుధవారం ట్రేడింగ్‌ 4శాతం లాభపడింది. రూ.480.20 వద్ద ప్రారంభమైన కంపెనీ షేరు రూ.492 ఇంట్రా‍డే  గరిష్ఠాన్ని రూ.480.20 ఇంట్రాడే కనిష్ఠాన్ని చూసింది. అంతర్జాతీయంగా వృద్ధి మందగమనంలో ఉండడంతో స్టీల్‌కు డిమాండ్‌ తగ్గినప్పటికి గోల్డ్‌మాన్‌ స్టాక్‌ ఈ షేరు కొనుగోలు టార్గెట్‌ను రూ.570 గా నిర్ణయించింది. వాణిజ్య యుద్ద భయాల ప్రభావం టాటా స్టీల్‌కు యూరప్‌లో ప్రతికూల ప్రభావం చూపిందని, ఇండియాలో దీని ప్రభావం తక్కువని టాటాస్టీల్‌ సీఈఓ, ఎమ్‌డీ టీవీ నరేంద్రన్‌ అన్నారు. ‘ప్రస్తుతం మేం మా కార్యచరణ సామర్థ్యాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నాం. భూషణ్‌ స్టీల్, మార్టీన్‌ ఉషా కలయికతో ఇండియా, ఓవర్‌సీస్‌లో ముందుకు వెళ్తాం’ అని​ వివరించారు. ఉదయం 11.00 సమయానికి టాటాస్టీల్‌ షేరు విలువ 3.32 శాతం లాభంతో రూ.488.0 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఏడాది ‍కనిష్ఠానికి జైన్‌ ఇరిగేషన్‌

Wednesday 19th June 2019

జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ షేరు విలువ బుధవారం 23.72 శాతం నష్టపోయి ఏడాది కనిష్ఠమైన రూ.20.90ను తాకింది. బకాయిలను చెల్లించలేకపోతుందనే కారణాన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌,, సంస్థ రేటింగ్‌ను ‘ఐఎన్‌డీ ఏ-’ నుంచి  ‘ఐఎన్‌డీ బీబీబీ’ కి తగ్గించి రేటింగ్‌ వాచ్‌ నెగిటివ్‌(ఆర్‌డబ్యూఎన్‌)లో చేర్చింది. దీంతో వరుసగా నాలుగవ రోజు కూడా నష్టాల్లోనే ట్రేడవుతోంది. జైన్‌ ఇరిగేషన్‌ షేరు విలువ గత ఏడాది కాలంలో 73 శాతం నష్టపోయింది.

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 19th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కెనరా బ్యాంక్‌:- కెన్‌ ఫిన్‌ హోమ్స్‌లో  మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  హెచ్‌సీఎల్‌ :- క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఏడాది కాలంలో పాటు సాంకేతిక సేవలు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదానీ పోర్ట్స్‌:-  ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ఇష్యూ రేటింగ్‌ను బిబిబి(-)కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో స్టేబుల్‌ అవుట్‌లుక్‌ కేటాయించింది. జైన్‌ ఇరిగేషన్‌:- ధీర్ఘకాలిక ఇష్యూ రేటింగ్‌ను ‘‘బిబిబి’’కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు ‘‘నెగిటివ్‌’’ అవుట్‌లుక్‌ను

Most from this category