News


టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌కు రేటింగ్‌ కోత

Tuesday 25th June 2019
Markets_main1561445286.png-26558

ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ ... టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూసీల్‌ కంపెనీల రేటింగ్‌పై కోతను విధించింది. ప్రస్తుతం స్టీల్‌ ధరలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అలాగే ఎర్నింగ్‌ రిస్క్‌, వాల్యూవేషన్లు విపరీంగా పెరిగాయి. దీంతో జూలై - సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఐరన్‌ ఓర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ఐరన్‌ ఓర్‌ ధరలు కంపెనీల వ్యయ నియంత్రణ చర్యలపై భారంగా మారేందుకు అవకాశం ఉన్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. ఇరు కంపెనీల షేర్ల ఈవి/ఎబిటాలకు పైన ట్రేడింగ్‌ అవుతున్నాయి. అలాగే గ్లోబల్‌ పీర్స్‌తో పోలిస్తే ప్రైస్‌ - టు - బుక్‌ విలువలు ప్రీమియంలో ఉన్నట్లు సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.
1.కంపెనీ పేరు: టాటాస్టీల్‌ 
రేటింగ్‌:- సెల్‌ 
టార్గెట్‌ ధర:- రూ.395
విశ్లేషణ:- ప్రసుత్త స్థాయి నుంచి షేరు 19శాతం పొటెన్షియల్‌ డౌన్‌గ్రేడ్‌కు క్షీణించవచ్చు.
2. కంపెనీ పేరు:- జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
రేటింగ్‌:- సెల్‌ 
టార్గెట్‌ ధర:- రూ.225
విశ్లేషణ:- ప్రసుత్త స్థాయి నుంచి షేరు 13 శాతం పొటెన్షియల్‌ డౌన్‌గ్రేడ్‌కు క్షీణించవచ్చు.
బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌పై కోత విధించిన నేపథ్యంలో ఇరు కంపెనీల షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో 2శాతానికి పైగా నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ రూ. 252.30ల వద్ద ఏడాది కనిష్టానికి పతనమైంది.  అయితే మిడ్‌సెషన్‌ సమయానికల్లా కొంతమేర రికవరిని సాధించగలిగాయి. మధ్యాహ్నం గం.12:00లకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు అరశాతం లాభంతో రూ.257ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. టాటాస్టీల్‌ 1శాతం లాభంతో రూ.490ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం జంప్‌

Tuesday 25th June 2019

మార్కెట్‌ ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ సమయానికి తిరిగి లాభాల్లోకి మళ్లి, తదుపరి 1 శాతం జంప్‌చేసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 30,567.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌లో మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్‌ అరశాతం(151 పాయింట్లు) నష్టపోయి 30,567.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయి.

ఎంఏసీడీ ఏం చెబుతోంది!

Tuesday 25th June 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

Most from this category