News


ఫలితాలతో టాటా స్టీల్‌ షేరు డీలా..!

Monday 10th February 2020
Markets_main1581313472.png-31652

5శాతానికి పైగా పతనమైన షేరు 
ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో క్వార్టర్‌ ఫలితాలు నిరుత్సాహపరడంతో టాటా స్టీల్‌ షేరు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 5శాతం నష్టాన్ని చవిచూసింది. కంపెనీ శుక్రవారం మార్కెట్‌ ముగింపు తరువాత ఫలితాలను వెల్లడించింది. ఫలితాలు మార్కెట్‌ను వర్గాలను మెప్పించకపోవడంతో ఈ షేరు నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు మునుపటి ముగింపు(రూ.470.95)తో పోలిస్తే 2.25శాతం నష్టంతో రూ.460.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో చైనాలోని ప్లాంట్‌లో మెటల్‌ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండం కూడా షేరు ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకే మొగ్గుచూపడంతో ఒక దశలో -5.39శాతం నష్టాన్ని చవిచూసి రూ.445.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.10:50ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.470.95)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.447 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.320.30, రూ.560.35గా నమోదయ్యాయి. 

టాటాస్టీల్‌ క్యూ3 ఫలితాలు:- 
ఈ క్యూ3లో కంపెనీ రూ.1,228 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,753 కోట్ల నికర లాభం ఆర్జించింది.  గత క్యూ3లో రూ.38,086 కోట్లుగా ఉన్న స్థూల అమ్మకాలు ఈ క్యూ3లో రూ.34,774 కోట్లకు తగ్గాయి. మొత్తం వ్యయాలు రూ.35,930 కోట్ల నుంచి రూ.35,849 కోట్లకు చేరాయి.  నిర్వహణ లాభం రూ.6,726 కోట్ల నుంచి రూ.3,659 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 17.3 శాతం నుంచి 10.2 శాతానికి తగ్గింది. ఒక్కో టన్నుకు నిర్వహణ లాభం రూ.10,404 కోట్ల నుంచి రూ.5,003 కోట్లకు తగ్గింది. భారత కార్యకలాపాలకు సంబంధించి నికర లాభం రూ.2,253 కోట్ల నుంచి 43 శాతం తగ్గి రూ.1,194 కోట్లకు చేరింది. ఆదాయం 5 శాతం తగ్గి రూ.21,299 కోట్లకు పడిపోయింది. అమ్మకాలు తక్కువగా ఉండటం, యూరప్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఇంపెయిర్‌మెంట్‌ కేటాయంపుల కారణంగా ఈ క్యూ3లో భారీగా నికర నష్టాలు వచ్చాయని వివరించింది. 



You may be interested

క్యూ3 ఎఫెక్ట్‌- యూపీఎల్‌ జోరు- బ్రిటానియా వీక్‌

Monday 10th February 2020

సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనం 90 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ  కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు కనిపిస్తున్నాయి. దీంతో వారాంతాన అమెరికా మార్కెట్లు డీలాపడగా.. ప్రస్తుతం దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. వెరసి ఉదయం 10.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 278 పాయింట్లు పతనమై 40,863కు చేరింది. నిఫ్టీ సైతం 90 పాయిం‍ట్లు క్షీణించి 12,008 వద్ద ట్రేడవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో

స్వల్పకాలానికి టాప్‌ వ్యూహాలు

Monday 10th February 2020

షార్ట్‌టర్మ్‌కు సత్ఫలితాలనిచ్చే కొన్ని వ్యూహాలను మోతీలాల్‌ఓస్వాల్‌ ఫిన్‌సర్వ్‌ సిఫార్సు చేస్తోంది. ఆప్షన్‌ రైటింగ్‌: 1. కోటక్‌ బ్యాంక్‌ 1720 కాల్‌ ఒక లాట్‌ను రూ.13.25 వద్ద విక్రయించడం. టార్గెట్‌ రూ.0.05. స్టాప్‌లాస్‌ రూ. 19.50. మార్జిన్‌: రూ. 1.02 లక్షలు. హెడ్జింగ్‌ కోసం కోటక్‌బ్యాంక్‌ 1800 కాల్‌ ఒకలాట్‌ను రూ. 4.20వద్ద కొనాలి. దీనికి స్టాప్‌లాస్‌ రూ. 13.50.  2. రిలయన్స్‌ 1500 కాల్‌ ఒకలాట్‌ను రూ. 11.35 వద్ద విక్రయించడం. టార్గెట్‌ రూ.

Most from this category