News


4శాతం నష్టపోయిన టాటాస్టీల్‌

Thursday 7th November 2019
Markets_main1573106563.png-29413

మెప్పించని క్యూ2 ఫలితాలు

టాటా స్టీల్‌ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. ఫలితంగా నేడు ఉదయం సెషన్‌లో కంపెనీ షేరు 3.85శాతం మేర నష్టపోయింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.3302.31 కోట్ల నికరలాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ ఆర్జించిన రూ.3,116 కోట్ల నికరలాభంతో ఇది 6శాతం అధికం. వన్‌టైమ్‌ పన్ను ద్వారా లభించిన రూ.4,233 కోట్ల లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభానికి సహాయపడింది. గ్లోబల్‌ బ్రేకరేజ్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ సాక్స్‌ షేరకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.443లకు పెంచింది. స్టాండ్‌లోన్‌ ప్రాతిపాదికన కంపెనీ క్యూ2 గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ.., ఇతర వ్యాపారాలలో నష్టాలు ప్రతికూలంగా మారినట్లు తెలిపింది. ఉక్కు ధరలు స్థిరంగా ఉండటం, ముడి ఖనిజం ధరలు తగ్గడంతో ప్రస్తుత త్రైమాసికం నుంచి ముఖ్యంగా యూరప్‌ వ్యాపారంలో కంపెనీ లాభాలను ఆర్జించవచ్చు. ప్రపంచ డిమాండ్ బలహీనపడటం, ఆదాయాలు పడిపోవడం లాంటి సమస్యలు పెరుగుతున్న కంపెనీ రుణాలను ఎలా తీర్చగలదనే అంశంపై ధీర్ఘకాలిక ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండో త్రైమాసికం నాటికి కంపెనీ నికర అప్పు 4శాతం పెరిగి రూ.1.07 లక్షల కోట్లకు చేరింది. ఈ క్యూ2లో కంపెనీ వడ్డీ కింద రూ.1,871 కోట్లను చెల్లించింది. ఎబిటా భారీగా తగ్గి కేవలం రూ.1,891 కోట్లుగానే నమోదైంది.

ఇక షేరు విషయానికొస్తే... నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.404.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. క్యూ2 ఫలితాలు బాగున్నప్పటికీ.., దీర్ఘకాలిక ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో షేరు ఇంట్రాడేలో 3.85శాతం నష్టపోయి రూ.389.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు షేరు క్రితం ముగింపు(రూ.404.35)తో పోలిస్తే 3.30శాతం లాభంతో రూ.391.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.320.30, రూ.610.00లుగా నమోదయ్యాయి.You may be interested

బ్రోకరేజీల టాప్‌ సిపార్సులు

Thursday 7th November 2019

కార్పోరేట్‌ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు సానుకూలంగా కదులుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠాన్ని నమోదుచేయగా, నిఫ్టీ కొత్త గరిష్ఠానికి చేరువలో ట్రేడవుతోంది. కార్పోరేట్‌ ఫలితాలు వెలువడ్డాక వివిధ కంపెనీలపై బ్రోకరేజి పాజిటివ్‌గా ఉన్నారు. వివిధ బ్రోకరేజిలు బై సిఫార్సును కలిగివున్న టాప్‌ కంపెనీలు.. బ్రోకరేజి: మోతిలాల్‌ ఓస్వాల్‌ హెచ్‌డీఎఫ్‌సీ: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: 2,600; అప్‌సైడ్‌: 19 శాతం కదలగలదు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్

యస్‌బ్యాంక్‌లో వాటా కోసం పోటాపోటీ!

Thursday 7th November 2019

రంగంలో రెండు బడా విదేశీ ఫండ్స్‌ దేశీయ ఫండ్స్‌ నుంచి కూడా ఆసక్తి అంతర్జాతీయ ఫండ్స్‌ డిస్కవరీ క్యాపిటల్‌, మార్షల్‌ వేస్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా యస్‌బ్యాంక్‌ వాటాలు కొనేందుకు రేసులో ఉన్నాయని విశ‍్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ సంస్థలే కాకుండా దేశీయ ఇన్వెస్టర్లైన ఆదిత్య బిర్లా ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ తదితరాలు కూడా యస్‌బ్యాంకులో వాటా కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వాటా విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకొని ఇబ్బందుల్లోంచి

Most from this category