News


5 శాతం నష్టపోయిన టాటాస్టీల్‌

Monday 26th August 2019
Markets_main1566804616.png-28021

అంతర్జాతీయ పరిణామాలతో పాటు, గత కొన్ని సెషన్ల నుంచి అమ్మకాల ఒత్తిడిలో ఉన్న టాటా స్టీల్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 5 శాతం మేర పతనమయ్యి రూ. 322.20 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాగా దేశీయ మార్కెట్‌లు తిరిగి లాభాల్లోకి రావడంతో ఈ షేరు రికవరి అయ్యింది. టాటా స్టీల్‌ మధ్యాహ్నాం 12.53 సమయానికి 2.69 శాతం నష్టపోయి రూ. 335.95 వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్‌లో రూ. 345.25 వద్ద ముగిసిన ఈ షేరు రూ. 346.40 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమవ్వడం గమనార్హం. అంతర్జాతీయంగా మందగమన సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న తరుణంలో కమోడిటీ షేర్లలో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఇదే ధోరణి దేశీయ కంపెనీల షేర్లలో కూడా కనిపిస్తోంది.



You may be interested

మిడ్‌సెషన్‌ కల్లా తిరిగి లాభాల్లోకి సూచీల్లోకి..

Monday 26th August 2019

ఆరంభలాభాల్ని నిలుపుకోవడంలో విఫలమైన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు సెన్సెక్స్‌ 493 పాయింట్లు లాభంతో 37194.33 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 10969.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల జరుగుతున్న వాణిజ్య యుద్ధ పరిష్కారం దిశగా త్వరలో చర్చలు జరగవచ్చనే అంశంతో తెరపైకి రావడంతో అమెరికా ఫ్యూచర్స్‌ ఒక్కసారిగా లాభాల్లోకి రావడంతో ఆసియా మార్కెట్లపై కొంతవరకు అమ్మకాల ఒత్తిడి తగ్గింది.

ఉద్దీపనల ప్రభావం స్వల్పకాలికమేనా?!

Monday 26th August 2019

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం కొన్ని ఆర్థిక చర్యలను ప్రకటించారు. కానీ ఈ ఆర్థిక చర్యలు కొద్దికాలానికే మార్కె‍ట్లకు ఉత్సాహాన్నిస్తాయని దీర్ఘకాలానికి మరిన్ని చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం ప్రకటించిన చర్యలలో ముఖ్యమైనది బడ్జెట్లో ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)లపై విధించిన అదనపు సర్‌చార్జీని ఎత్తివేయడం, కానీ దీని ఫలితాన్ని దేశియ హెడ్జ్‌ఫండ్స్‌ వాడుకోకుండా చేయడంపై ఇన్వెస్టర్లు

Most from this category