News


టాటాస్టీల్‌ 7% అప్‌!

Tuesday 29th October 2019
Markets_main1572325344.png-29197

టాటా స్టీల్‌ భుషణ్‌ స్టీల్‌ ఉత్పత్తి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పెరగడంతో టాటా స్టీల్‌ ఉత్పత్తి ఇండియాలో పెరిగింది. అంతేకాకుండా అమ్మకపు పరిమాణం గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే మార్పులేనప్పటికి, గత త్రైమాసికంతో పోల్చుకుంటే పెరిగింది. ఫలితంగా ఈ కంపెనీ తన సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో మంచి సంఖ్యలను ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వీటితో పాటు టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటర్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడం, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ సరళతరమవ్వడం, బ్రెగ్జిట్‌ వాయిదా వంటి అంతర్జాతీయ సానుకూలంశాలు తోడవ్వడంతో టాటా స్టీల్‌ షేరు మంగళవారం సెషన్‌లో ర్యాలీ చేస్తోంది. ఉదయం 10.25 సమయానికి ఈ షేరు 7.27 శాతం లాభపడి రూ. 391.55 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 365.00 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్‌లో రూ. 365.55 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలు నవంబర్‌లో వెలువడే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా తేదిని ప్రకటించలేదు.



You may be interested

ఆల్‌టైం ​గరిష్ఠానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Tuesday 29th October 2019

షార్ట్‌పొజిషన్లు కవర్‌వుతుండడంతో పాటు, మొత్తంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై మార్కెట్‌ వర్గాలలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఉండడంతో ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం సెషన్‌లో కొత్త గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.43 సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విలువ 1.95 శాతం లాభపడి రూ. 1462.00  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 1,434.25 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్లో రూ. 1,445.50 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమై, రూ.

ఎయిర్‌టెల్‌ ఫలితాలు వాయిదా!

Tuesday 29th October 2019

నవంబర్‌ 14న వెల్లడి సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల విడుదలను భారతీ ఎయిర్‌టెల్‌ వాయిదా వేసింది. మంగళవారం ఫలితాలు వెలువరించాల్సిఉండగా, వీటిని వచ్చే నెల 14కు వాయిదా వేసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) అంశంపై మరింత స్పష్టత రావాల్సిఉందని అందుకే ఫలితాలు వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఏజీఆర్‌ నిర్వచనానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు టెల్కోలకు షాక​ ఇచ్చే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మరింత స్పష్టత కోసం డీఓటీని

Most from this category