News


టాటా మోటార్స్‌ ర్యాలీ... ఎంత వరకు?!

Thursday 4th April 2019
Markets_main1554318091.png-24963

టాటా మోటార్స్‌ స్టాక్‌ ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటి వరకు 27 శాతం పెరిగింది. నిఫ్టీ-50లో బాగా పెరిగిన టాప్‌ 5 స్టాక్స్‌లో ఇదీ ఒకటి. ఈ నెల 2న కీలకమైన సైకలాజికల్‌ స్థాయి రూ.200ను అధిగమించి పైన క్లోజయింది. 2018 నవంబర్‌ తర్వాత ఈ స్థాయిని దాటడం మళ్లీ ఇదే. మార్చి త్రైమాసికం ఎర్నింగ్స్‌ మెరుగుపడొచ్చని, కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహాలు మెరుగుపడొచ్చని కంపెనీ అంచనాలు ప్రకటించింది. దీంతో స్టాక్‌ ర్యాలీ చోటు చేసుకుంది. అయితే, ఈ స్టాక్‌ పుంజుకున్నప్పటికీ అనలిస్టులు మాత్రం అప్రమత్త ధోరణితో ఉన్నారు. చైనాలో అధిక జేఎల్‌ఆర్‌ నిల్వలు, బ్రెగ్జిట్‌ అంశంతో కంపెనీ వృద్ధిపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

 

టాటా మోటార్స్‌పై న్యూట్రల్‌ (తటస్థం) కాల్‌తో ఉన్నట్టు నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ నవీన్‌కుమార్‌ దూబే తెలిపారు. మార్చి త్రైమాసికం ఫలితాలు చూసిన తర్వాతే ఈ స్టాక్‌ విషయంలో తదుపరి కాల్‌ తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్యకలాపాల విషయంలో ఆందోళనలు ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుత ర్యాలీ స్టాక్‌ తక్కువ ‍వ్యాల్యూషన్‌లో ఉండడం, అంచనాలు మెరుగుపడడం వల్లే. ఇక్కడి నుంచి గమనించాల్సిన అంశాలు... చైనా, యూరోప్‌లో అధిక నిల్వలు, బ్రెగ్జిట్‌కు సంబంధించి అనిశ్చితి (కంపెనీ ప్లాంట్‌ ఏప్రిల్‌లో 2-3 వారాలు మూసేయవచ్చు)’’ అని నవీన్‌ కుమార్‌ దూబే తెలిపారు. కంపెనీ ఎబిట్‌ మార్జిన్‌ 2018-19లో ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2020-22 మధ్య 3-6 శాతం పెరుగుతుందన్నారు. 

 

చైనాలో విక్రయాలు తగ్గడం (ఈ ఏడాది ఇప్పటికే 33 శాతం తగ్గుదల) వల్ల తక్కువ ఎబిట్‌ మార్జిన్‌ కొనసాగుతుందని ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ తెలిపారు. బ్రెగ్జిట్‌ అంశం, కరెన్సీ అస్థిరతలు జేఎల్‌ఆర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘టాటా మోటార్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న మా దృక్పథాన్ని కొనసాగిస్తున్నాం. ఒకటికి మించిన రిస్క్‌లు ఉన్నందున దీనికి దూరంగా ఉండాలి’’ అని ప్రభాకర్‌ సూచించారు. హీరో మోటోకార్ప్‌ను సూచించారు. రూ.2,500 స్థాయిలో హీరో మోటోకార్ప్‌ మంచి కొనుగోలు అవుతుందన్నారు. బలమైన బ్యాలన్స్‌ షీటు, మోటార్‌సైకిల్‌ విభాగంలో లీడర్‌గా ఉండడం, 12 పీఈ వద్ద ట్రేడవడం (చారిత్రకంగా 15పీఈ కంటే తక్కువ) వల్ల మరింత పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. టాటా మోటార్స్‌ సొంత సబ్సిడరీ జేఎల్‌ఆర్‌ కారణంగా టాటా కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఇటీవలే తగ్గించిన విషయం తెలిసిందే. కాగా, టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ కర్ల మాత్రం టాటా మోటార్స్‌ విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. సమస్యలన్నీ ముగిసిపోయాయని, రూ.200 దాటిన తర్వాత కూడా ఈ స్టాక్‌ కొనుగోలు రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్టు చెప్పారు.  You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 4th April 2019

 క్రితం రోజు రికార్డుస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనై క్షీణతతో ముగిసిన భారత్‌ సూచీలు...గురువారం  ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పనష్టంతో ట్రేడవుతోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 3 పాయింట్ల నష్టంతో 11,726 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,729 పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా

ఈ సందర్భాల్లో... టికెట్‌ క్యాన్సిల్‌ చేసినా రిఫండ్‌ రాదు!

Thursday 4th April 2019

ఐఆర్‌సీటీసీ వెబ్‌ పోర్టల్‌, యాప్‌ ద్వారా రైలు టికెట్లు బుక్‌ చేసుకునే ప్రతి ఒక్కరూ రిఫండ్‌ నిబంధనలను కచ్చితంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. టికెట్‌ క్యాన్సిల్‌ లేదా డిపాజిట్‌ రిసీట్‌ (టీడీఆర్‌)ను నిర్ణీత సమయంలోపు క్యాన్సిలేషన్‌ కోసం ఫైల్‌ చేస్తేనే నిబంధనల ప్రకారం వెనక్కి రావాల్సిన మొత్తం మీకు లభిస్తుంది. ఎటువంటి సందర్భాల్లో టికెట్లు క్యాన్సిల్‌ చేసుకుంటే రిఫండ్‌ రాదన్నది చూస్తే...    రిజర్వేషన్‌ కన్‌ఫర్మ్‌ అయిన టికెట్‌ను రైలు షెడ్యూల్డ్‌ డిపార్చర్‌

Most from this category