News


టాటామోటర్స్‌ డౌన్‌ 5.5 శాతం

Monday 29th July 2019
Markets_main1564390513.png-27383

దేశీయ వాహన దిగ్గజ కంపెనీ టాటామోటర్స్‌ షేర్లు 5.50శాతం వరకు నష్టపోయాయి. తొలి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ప్రకటించకపోవడంతో పాటు నేడు అటో రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు టాటా షేర్ల పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.148.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

శనివారం జరిగిన 36వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త కార్లపై రిజిస్ట్రేషన్‌ ధరలను రూ.5000లుగా, అదే 15ఏళ్లపై పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ మార్చాలంటే అదనంగా రూ.10వేల వరకు పెంచుతున్నట్లు కౌన్సిల్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ధరలు రూ.600లు మాత్రంగానే ఉన్నాయి. అలాగే కొత్త ద్విచక్ర వాహన రిజిస్టే‍్రషన్‌ ధరను రూ.1000లుగా, పునరుద్ధరణ రిజిస్ట్రేషన్‌ ధరను రూ.2000లకు పెంచింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అటోరంగ షేర్ల తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి.

అలాగే గతవారంలో కంపెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. మార్కెటింగ్‌ వ్యయాలు పెరగడం, భారత్‌, చైనాల్లో అమ్మకాల్లో తగ్గుముఖం పట్టడంతో పాటు వాహనాలపై అధిక డిస్కౌంట్ల ప్రకటన తదితర కారణాలతో కంపెనీ రూ.3,680 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. ఆదాయం 8శాతం క్షీణించి రూ.61,467 కోట్లుగా నమోదైంది. వడ్డీవ్యయాలు రూ.336 కోట్ల నుంచి రూ.1712 కోట్లకు పెరిగాయి. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో కంపెనీ షేర్లు వరుసగా గత మూడురోజులుగా అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోంటున్నాయి. 

నేటి ట్రేడింగ్‌లో ఒకదశలో 5.50శాతం మేర క్షీణించి రూ.138.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. మధ్యా‍హ్నం గం.1:45ని.లకు షేరు గతముగింపు ధర (రూ.147.20)తో పోలిస్తే 5శాతం క్షీణించి రూ.139.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.138.15, రూ.282.00లుగా నమోదైంది.



You may be interested

9 శాతం డౌన్‌...2 నెలల కనిష్టానికి గ్రాసిమ్‌

Monday 29th July 2019

ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసీం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 2నెలల కనిష్టానికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.875.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి మార్కెట్‌ పతనంలో భాగంగా ఇంట్రాడేలో సిమెంట్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఆదిత్యాబిర్లా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌...ఇదే గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌, వోడాఫోన్‌ ఐడియాల్లో గణనీయమైన వాటా కలిగి వుంది.

27 శాతం పతనమైన వోడాఫోన్‌-ఐడియా

Monday 29th July 2019

టెలికాం షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ఉన్నాయి.  వోడాఫోన్‌-ఐడియా బలహీన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో ఈ కంపెనీ షేరు విలువ ఉదయం 1.39 సమయానికి 27.03 శాతం నష్టపోయి, రూ. 6.75 వద్ద ట్రేడవుతోంది. టెలికాం షేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ. 4,873 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించగా, కంపెనీ ఆదాయం సైతం 11 శాతం క్షీణించి రూ.11,270 కోట్లకు పడిపోయింది. మిగిలిన వాటిలో టెలికాం ఇండెక్స్‌లో

Most from this category