News


కరోనా ఎఫెక్ట్‌: టాటా మోటర్స్‌ 6 శాతం డౌన్‌

Tuesday 18th February 2020
Markets_main1582010993.png-31895

టాటా మోటర్స్‌ షేరు మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా 6శాతం నష్టాన్ని చవిచూసింది.  కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అక్కడి రీటైల్‌ అమ్మకాలు భారీగా తగ్గిపోవచ్చని ఐఫోన్ల తయారీ ఆపిల్‌ అంచనా వేసింది. దీంతో చైనాలో అత్యధిక రీటైల్‌ అమ్మకాలు చేసే టాటామోటర్స్‌ జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు క్షీణించవచ్చనే అందోళనతో ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా చైనాలో టాటా మోటర్స్‌కు చెందిన జేఎల్‌ఆర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా మందగించింది. ఈ జేఎల్‌ఆర్‌ ప్లాంట్‌ ఏడాదికి 2లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. చైనాకు ఎగుమతయ్యే మొత్తం వాహనాల్లో 75శాతం బయటి దేశాల నుంచి ఎగుమతి కాగా, మిగిలిన 25శాతం నుంచి ఈ ప్లాంట్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఈ యూనిట్‌ నుంచి డిసెంబర్‌ త్రైమాసికపు రిటైల్‌ వాహన ఉత్పత్తులు ఏకంగా 21శాతం వృద్ధిని సాధించాయి. ఇప్పుడు ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి డిమాండ్‌ తగ్గడంతో పాటు తిరిగి పనులు ప్రారంభించేందుకు మరికొంత సమయం పట్టవచ్చని యాజమాన్య ప్రకటనతో ఈ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో 5.08శాతం నష్టపోయి రూ.160.50 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:20ని.కు ఇండెక్స్‌ నిన్నటి ముగింపు (రూ.169)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.162.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00, రూ.239.30లుగా నమోదయ్యాయి. 



You may be interested

52 వారాల కనిష్టానికి 146 షేర్లు

Tuesday 18th February 2020

మంగళవారం 52 వారాల కనిష్టానికి 146 షేర్లు పడిపోయాయి. వీటిలో 3పి ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అడ్రోయిట్‌ ఇన్‌ఫోటెక్‌, ఆగ్రో టెక్‌ఇండియా, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కిడ్‌ప్లే ఇండస్ట్రీస్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆటోమోటివ్‌ స్టాంపింగ్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అట్లాంటా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బిల్‌

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు ఎన్‌సీఎల్‌టీ ఊరట

Tuesday 18th February 2020

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ను  రూ.19,700 కోట్లకు సొంతం చేసుకునేందుకు దివాలా చట్టం కింద జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతించింది. అంతేగాకుండా పాత ప్రమోటర్లపై ఉన్న కేసులు కొత్త యాజమాన్యానికి వర్తించదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంగళవారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 1.63 శాతం తగ్గి 283.45 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

Most from this category