News


మిడ్‌టర్మ్‌కు టాప్‌ 10 రికమండేషన్లు

Monday 18th November 2019
Markets_main1574069456.png-29676

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినందించే పదిషేర్లను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు. 
రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ వికాస్‌ జైన్‌ సిఫార్సులు:
1. అంబుజా సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 224. స్టాప్‌లాస్‌ రూ. 190. డైలీ చార్టుల్లో హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరిచింది. టర్నెరౌండ్‌కు రెడీగా ఉన్న సంకేతాలు ఇస్తోంది. 
2. కాడిలా హెల్త్‌కేర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 265. స్టాప్‌లాస్‌ రూ. 218. దిగువన బహుళస్థాయి మద్దతు పొంది పాజిటివ్‌ బౌన్స్‌ బ్యాక్‌ చూపింది. కీలక సాంకేతిక ఇండికేటర్లు పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. 
చార్ట్‌వ్యూఇండియా మజార్‌ మహ్మద్‌ సిఫార్సులు:
1. టాటామోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 187. స్టాప్‌లాస్‌ రూ. 165. పదిపన్నెండు సెషన్లుగా రూ. 165- 179 రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతోంది. అంతకుముందు రూ. 112 నుంచి మంచి బౌన్స్‌ చూపింది. కన్సాలిడేషన్‌  అనంతరం పాజిటివ్‌ బ్రేకవుట్‌ చూపగలదు.
2. ఎయూ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 897. స్టాప్‌లాస్‌ రూ. 740. పలు రోజుల కన్సాలిడేషన్‌ నుంచి భారీ బ్రేకవుట్‌ సాధించింది. గతంలో రూ. 648కి పడిపొయినా వెనువెంటనే రికవరీ చెందింది. ఈ కౌంటర్లో చిన్నపాటి పతనాన్నైనా కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చు.
3. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 347. స్టాప్‌లాస్‌ రూ. 297. పదిసెషన్ల పాటు రూ. 300 వద్ద కన్సాలిడేషన్‌ పూర్తి చేసుకొని మరోమారు అప్‌ట్రెండ్‌ కొనసాగించేందుకు రెడీ అవుతోంది. రూ. 323ను బలంగా దాటితే వేగవంతమైన ర్యాలీ ఉండొచ్చు. 
రెలిగేర్‌ బ్రోకింగ్‌ అజిత్‌ మిశ్రా సిఫార్సులు:
1. టాటాకెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. .670. స్టాప్‌లాస్‌ రూ. 624. వీక్లీ చార్టుల్లో 200 రోజుల డీఎంఏ వద్ద బలమైన బేస్‌ ఏర్పరుచుకుంది. మధ్యలో చిన్నపాటి పతనం చూపి రూ. 620 మద్దతు జోన్‌ను టచ్‌ చేసి మరలా రికవరీ చెందింది. ప్రస్తుత స్థాయిల వద్ద కొనుగోళ్లకు అవకాశం. 
2. హెచ్‌డీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2280. స్టాప్‌లాస్‌ రూ. 2180. గత ర్యాలీ అనంతరం రిట్రేస్‌మెంట్‌ చూపింది. రూ.2200 వద్ద తక్షణ మద్దతు పొందింది. ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో కనిపిస్తున్న జోరుతో ఈ షేరు కూడా బౌన్స్‌ బ్యాక్‌ అయ్యేందుకు రెడీగా ఉంది. 
3. పీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 118. స్టాప్‌లాస్‌ రూ. 107. రెండువారాలు స్వల్పరేంజ్‌లో స్థిరీకరణ చూపింది. ఇందులో మద్దతు జోన్‌కు పైనే నిలిచి బలాన్ని పొందింది. ప్రస్తుతం కొత్త అప్‌మూవ్‌కు సంకేతాలు కనిపిస్తున్నాయి. 
కోటక్‌ సెక్యూరిటీస్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ సిఫార్సులు:
1. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 900. స్టాప్‌లాస్‌ రూ. 840. దీర్ఘకాలిక రిట్రేస్‌మెంట్‌ పూర్తి చేసుకొని బలమైన రివర్సల్‌ చూపింది. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ రౌండింగ్‌ బాటమ్‌ ఏర్పరిచి తదుపరి అప్‌మూవ్‌ను సూచిస్తోంది. 
2. బెర్గర్‌ పెయింట్స్‌: టార్గెట్‌ రూ. 525. స్టాప్‌లాస్‌ రూ. 470. ఇటీవలి ర్యాలీలో ఒక్కమారుగా దూసుకుపోయి తోటి కంపెనీల షేర్లను తోసిరాజన్నది. అనంతరం రిట్రేస్‌మెంట్‌కు లోనైంది. ప్రస్తుత మద్దతు స్థాయిల నుంచి మరో అప్‌మూవ్‌ రెడీగా ఉన్న సంకేతాలున్నాయి. You may be interested

ఎస్సార్‌ కేసు పరిష్కారం..... ఎస్‌బీఐ,ఐసీఐసీఐ బ్యాంక్‌లపై సానుకూలం!

Monday 18th November 2019

ఎస్సార్‌ స్టీల్‌కు సం‍బంధించి అక్టోబర్‌ 2018 రిజల్యూషన్‌ ప్రణాళిక ప్రకారమే నడుచుకోవాలని సుప్రీం కోర్టు తీర్పివ్వడంతో శుక్రవారం సెషన్‌లో ర్యాలీ చేసిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు, సోమవారం సెషన్‌లో కూడా ఆ ర్యాలీ కొనసాగిస్తున్నాయి. ఈ తీర్పుతో ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి ఆర్సెలర్‌ మిట్టల్‌కు మార్గం సుగమమైంది. సుప్రీం తీర్పుతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అధికంగా లాభపడనున్నాయి. ఫలితంగా చాలా వరకు బ్రోకరేజిలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి.

గ్లెన్‌మార్క్‌కు రేటింగ్‌ జోష్‌..!

Monday 18th November 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరకు జోష్‌నిచ్చింది. ఫలితంగా సోమవారం ఇంట్రాడేలో షేరు 21శాతం లాభపడింది. నేడు ఈ కంపెనీ బీఎస్‌ఈలో 308.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ‘‘ఈ ఆ‍ర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ అంచనాలకు మించి ఫలితాలను సాధించింది. అమెరికాలో అమ్మకాల వేగం మరింత పుంజు‍కుంటుంది. అయితే దేశీయ వ్యాపారం ఫార్మా పరిశ్రమ రేటు కంటే పెరుగుతూనే ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మూడేళ్లలో

Most from this category