News


టాటామోటర్స్‌ రయ్‌

Thursday 5th September 2019
Markets_main1567675810.png-28218

రెండు రోజుల వరుస పతనం అనంతరం టాటామోటర్స్‌ షేర్లు లాభాల పట్టాలెక్కాయి. ఆగస్ట్‌లో అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ విక్రయాలు క్షీణించినప్పటికీ.., షేర్లు ర్యాలీ చేయడం విశేషం. నేడు బీస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 110.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒకదశలో 7శాతం లాభపడి రూ.117.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ జేఎల్‌ఆర్‌ అమ్మకాలు బ్రిటన్‌లో 20.8శాతం క్షీణించి  2,726 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 3,444 యూనిట్ల విక్రయం జరిగింది. అలాగే అమెరికాలోనూ జేఎల్‌ఆర్‌ విక్రయాలు 10శాతం క్షీణించి 8,700 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక దేశీయంగానూ ఇదే ఆగస్ట్‌లో  అమ్మకాలు 49శాతం క్షీణించాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 62,688 యూనిట్ల విక్రయాలు జరగ్గా, ఈ ఆగస్ట్‌ నాటికి 57,210 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం గం.3:00లకు షేర్లు గత ముగింపు ధర(రూ.109.5)తో పోలిస్తే 6.50శాతం లాభంతో రూ.116.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది, కనిష్ట ధరలు వరుసగా రూ.106.00 రూ.282.00లుగా నమోదయ్యాయి.  



You may be interested

కరెక‌్షన్‌లో కొనేస్తున్నారు!

Thursday 5th September 2019

వాటాలు పెంచేసుకుంటున్న ప్రమోటర్లు ఆగస్టు నెలలో మార్కెట్లో వచ్చిన కరెక‌్షన్‌ ప్రమోటర్లకు వరంగా మారింది. చాలామంది ప్రమోటర్లు ఈ పతనంలో తమ సొంత కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొని వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలంచిన్న కంపెనీల ప్రమోటర్లే కాకుండా పెద్ద కంపెనీల ప్రమోటర్లు కూడా ఇలా వాటాలు పెంచుకోవడం గమనార్హం. ఇలాంటివాటిలో యునైటెడ్‌ స్పిరిట్స్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, వొడాఫోన్‌ ఐడియా, చోళ ఫైనాన్షియల్స్‌, దీపక్‌ నైట్రేట్‌, సంగమ్‌ ఇండియా,

వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపునకు ప్రయత్నిస్తా: గడ్కరీ

Thursday 5th September 2019

ప్రస్తుతం దేశియ వాహన రంగం మందగమనాన్ని ఎదుర్కొం‍టుందని, మందగమనం నుంచి బయటపడడానికి సహాయం కోసం ఎదురుచూస్తోందని సియామ్‌(సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చురర్స్‌) ఎన్‌క్లేవ్‌లో కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.  అంతేకాకుండా సియామ్‌ ఎప్పటి నుంచో కొరుతున్న పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై జీఎస్‌టీ రేటు తగ్గింపు విషయాన్ని గురించి ఆర్థిక శాఖతో మాట్లాడతానని హామి ఇచ్చారు. కాగా వాహనాల విక్రయాలు తగ్గిపోవడంతో ఆటో రంగం

Most from this category