News


టాటా మోటర్స్‌ ర్యాలీ

Tuesday 27th August 2019
Markets_main1566891377.png-28049

అటోరంగ షేర్లు ర్యాలీలో టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.112.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దేశీయంగా చిన్నాభిన్నమైన అటో పరిశ్రమను గాడిన పెట్టేందుకు శుక్రవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు ఉద్దీపనలు ప్రకటించారు. అందులో భాగంగా వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు వాయిదా వేయడం, ప్రభుత్వ విభాగాలు పెట్రోలు, డిజిల్‌ వాహనాలు కొనుగోలు చేయకుంగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం లాంటి పలు ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అటోరంగాలకు కొనుగోళ్ల మద్దతు లబిస్తోంది. అందులో భాగంగా మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు టాటామోటర్స్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ క్రమంలో షేరు ఒకదశలో 7.50శాతం ర్యాలీ చేసి రూ.119.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు షేరు క్రితం ముగింపు (రూ.110.5)తో పోలిస్తే 7శాతం లాభంతో రూ.118.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వురుసగా రూ.106.20 రూ.282.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

టాప్‌గేర్లో ఆటో రంగ షేర్ల ర్యాలీ

Tuesday 27th August 2019

నెమ్మదించిన వాహనరంగాన్ని పరుగులు పెట్టేందుకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించడంతో రెండోరోజూ ఆటో షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.  వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు వాయిదా వేయడం, ప్రభుత్వ విభాగాలు పెట్రోలు, డిజిల్‌ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనుగోలు చేసే బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు మొత్తం వరకు కొనసాగించడం లాంటి పలు ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్నటి

లాభాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 27th August 2019

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు వరుసగా రెండోరోజూ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల నిధుల కేటాయిస్తున్నట్లు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఈ రంగ షేర్లలో ర్యాలీ నెలకొంది. తాజా నిన్న ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదం వేయడం కూడా కలిసొచ్చింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90వేల కోట్ల డివిడెండు

Most from this category