News


టాటామోటార్స్‌ షేరు 5% డౌన్‌

Wednesday 4th March 2020
news_main1583317126.png-32277

బుధవారం టాటా మోటార్స్‌ షేరు 5 శాతానికి పతనమైంది. 2020 ఫిబ్రవరిలో 34.42 శాతం పడిపోయాయని కంపెనీ మంగళవారం ప్రకటించడంతో నేడు షేరు విలువ పడిపోయింది. కోవిడ్‌-19 ప్రభావంతో చైనానుంచి సరఫరా కావాల్సిన విడిభాగాలు ఆగిపోవడంతో టాటామోటార్స్‌ ఉత్పత్తి తగ్గిందని కంపెనీ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో 56,826 యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 37,826కు పడిపోయింది. అంతేకాకుండా వాణిజ్య వాహనాల ఉత్పత్తి గతేడాదిలో 45.8 శాతంగా ఉంటే ఈ ఏడాది 35శాతానికి పడిపోయింది. మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు సైతం 29.4 శాతానికి పడినట్లు  కంపెనీ పేర్కొంది. మొత్తంగా చూస్తే ఈ ఫిబ్రరిలో 34 శాతం విక్రయాలు పతనమై 38,002 యూనిట్లుగా నమోదైయ్యాయి. మార్కెట్‌ ముగిసేసమయానికి టాటామోటార్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం తగ్గి రూ.163.40 వద్ద ముగిసింది.



You may be interested

ఆటుపోట్ల మధ్య నష్టాల ముగింపు

Wednesday 4th March 2020

సెన్సెక్స్‌ 214 పాయింట్లు డౌన్‌ 52 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఫార్మా, ఐటీ రంగాలు లాభాల్లో కరోనా కల్లోలానికి చెక్‌ పెట్టేందుకు వీలుగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నపళంగా అర శాతం వడ్డీ రేటును తగ్గించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 214 పాయింట్లు క్షీణించి 38,409 వద్ద నిలవగా.. నిఫ్టీ 52 పాయింట్ల వెనకడుగుతో 11,251 వద్ద స్థిరపడింది. ఫెడ్‌ వడ్డీ తగ్గింపుతో మంగళవారం తొలుత అమెరికా మార్కెట్లు 1

చౌక నిధులతో బబుల్‌ !

Wednesday 4th March 2020

వడ్డీ రేట్లను తగ్గిస్తున్న కేంద్ర బ్యాంకులు  2008లో పరిస్థితులు తలెత్తవచ్చు రెండేళ్లలో బబుల్‌ ఏర్పడే అవకాశం - జిమ్‌ రోజర్స్‌, రోజర్స్‌ హోల్డింగ్స్‌ పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరోసారి నమ్మశక్యంకాని స్థాయిలో తగ్గిస్తూ వెళుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు మేలు చేయదంటున్నారు రోజర్స్‌ హోల్డింగ్స్‌ చైర్మన్‌ జిమ్‌ రోజర్స్‌. దీంతో రెండేళ్లలో  గాలి బుడగ(బబుల్‌) పరిస్థితులు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఈక్విటీ మార్కెట్లు, బంగారం తదితర అంశాలపై

Most from this category