News


రిలయన్స్‌, టాటామోటర్స్‌, పీఎస్‌యూ స్టాకులపై పాజిటివ్‌

Tuesday 29th October 2019
Markets_main1572345489.png-29211

-హెమాంగ్‌ జాని, షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
‘గతంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుం‍చి డీమెర్జర్‌ జరిగిన తర్వాత స్టాక్‌ హోల్డర్లకు మంచి లాభాల్ని పొందారని, ఇప్పుడు కూడా రిలయన్స్‌ జియో డీమెర్జ్‌ మార్కెట్‌ వర్గాలను ఆకర్షిస్తోందని, ఈ కంపెనీ షేరు రీరేట్‌ అవుతుంది’ అని షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జాని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
ఆటో రంగం పుంజుకుంటోంది..
ఒకే రంగంలోని అధ్వాన్న ప్రదర్శన చేస్తున్న కంపెనీలు అంచనాల కంటే మంచి ఫలితాలను ప్రకటించినప్పడు, ఇన్వెస్టర్లు ఆ రంగంపై  సౌకర్యంగా ఉంటారు. మొత్తం ఆటో సెక్టార్‌లో టాటా మోటర్స్‌ కింది స్థాయిలో ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ జేఎల్‌ఆర్‌ మార్జిన్లు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 13.8 శాతం పెరిగాయి. అంతేకాకుండా కంపెనీలోకి నిధుల ప్రవాహం బాగుంది. వచ్చే కొన్ని నెలలలో ఇన్వెస్టర్లు ఈ సెక్టార్‌పై పూర్తి ఆసక్తిని కలిగివుంటారని అంచనావేస్తున్నాం.  ఈ రంగంలో పునరుద్ధరణ గణనీయంగా లేకపోయినప్పటికి, పాజిటివ్‌ వార్తల వలన ఇన్వెస్టర్లు కొంత సౌకర్యాన్ని పొందుతున్నారు. మాకు సంబంధించినంత వరకు టాటా మోటర్స్‌పై ఏదైనా వైఖరి తీసుకునే ముందు, రానున్న ఆటో అమ్మకాల గణాంకాల్ని పరిగణలోకి తీసుకొని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. కానీ నవంబర్‌ 1 నుంచిఆటో గణాంకాల్లో పెద్ద మార్పు రానున్నట్టు మార్కెట్లు వర్గాలు ఇప్పటికే నమ్ముతున్నాయి. 
ఐసీఐసీ బ్యాంక్‌ కన్నా రిలయన్స్‌ బెటర్‌..
ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ రెండు కంపెనీలలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై మా ప్రాధాన్యత అధికంగా ఉంది. ఈ కంపెనీ రిలయన్స్‌ జియోను డిమెర్జర్‌ చేయనుండడంతో, ఈ కంపెనీ షేరు ఆసక్తిగా కనిపిస్తోంది. అంతేకాకుండా రిలయన్స్‌ రిటైల్‌ విభాగం కూడా పాజిటివ్‌గా ఉంది. అయినప్పటికి కంపెనీకి అధిక రుణాలుండడం, షేర్‌హోల్డర్ల మధ్య డిమెర్జింగ్‌ విలువ పంపిణీ అంశాలపై మార్కెట్‌ వర్గాలు ఆందోళనగానే ఉన్నాయి. కానీ అనుబంధ కంపెనీని ఏర్పరచడం, కొంత రుణాలను ఆ కంపెనీకి మరల్చడమనేది డీమెర్జింగ్‌ విధానానికి ముందు జరిగే పక్రియ.
    చందాదారులను కలుపుకోవడంలో, ఆపరేటింగ్‌ ప్రదర్శన విభాగాలలో రిలయన్స్‌ జియో బలంగా ఉండడంతో ఈ కంపెనీ విలువపై మార్కెట్‌ వర్గాలలో ఆసక్తి పెరిగింది.  గతంలో కూడా రిలయన్స్‌ నుం‍చి డీమెర్జ్‌ అయిన కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తీసుకొచ్చాయి. అందువలన రిలయన్స్‌ డీమెర్జర్‌ జరిగితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రీరేటింగ్‌ జరిగే అవకాశం అధికంగా ఉంది. 

పీఎస్‌యూ స్టాకులను పరిశీలించాలి...
కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన తర్వాత, డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ సారి ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌పై సీరియస్‌గా ఉందనే సంకేతాలనిస్తున్నాయి. ట్యాక్స్‌ను తగ్గించడం వలన ద్రవ్యలోటు సమస్యలను తగ్గించేందుకు డిజిన్వె‍స్ట్‌మెంట్‌ పక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. బీపీసీఎల్‌(భారత పెట్రోలియం), కంటైనర్‌ కార్పోరేషన్‌ వంటి నిర్థిష్టమైన ప్రభుత్వ రంగ స్టాకులు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కంపెనీలు వాటివాటి వ్యాపారాలలో బలంగా ఉండడం, వాటి బ్యాలెన్స్‌ షీట్లు బాగుండడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు ఈ స్టాకులకు ఆకర్షితులవుతున్నారు.
   ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో పాటు, పీఎస్‌యూ స్టాకులు అధ్వాన్న ప్రదర్శనను చేయడంతో గత రెండేళ్లలో డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియపై ప్రభుత్వం వేగం తగ్గించిన విషయం తెలిసిందే. అయినప్పటికి కొన్ని కంపెనీలు మంచి ప్రదర్శనను చేశాయి. కానీ గత మూడేళ్లలో ఈ స్టాకులు అంతగా పెరగలేదు. బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పోరేషన్‌, ఇతర నాణ్యమైన ప్రభుత్వ రంగ స్టాకులు రీరేట్ అవుతాయని అంచనావేస్తున్నాం. మేము బీపీసీఎల్‌పై పూర్తి సానుకూలతతో ఉన్నాం. ఈ స్టాకు రీరేట్‌ అవుతుందని అంచనావేస్తున్నాం. దీనితోపాటు ఐఓసీ లేదా హెచ్‌పీసీఎల్‌ వంటి కంపెనీల స్టాకులు కూడా బీపీసీఎల్‌ను అందుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రస్తుతం నిర్ధిష్టమైన పీఎస్‌యూ స్టాకులను ఎంచుకోవడం చాలా మంచిది. 

ఆటో నెంబర్లపైనే దృష్ఠి
వాహన అమ్మకాల గణాంకాలు నవంబర్‌ నెల నుంచి రానున్నాయి. వీటిలో చాలా సానుకూల మార్పు ఉంటుందని అంచనావేస్తున్నాం. గత కొన్ని నెలల నుంచి ఆటో నెంబర్లు పుంజుకున్నాయి. మార్కెట్‌ కూడా ఆటో రంగం పుంజుకోవడంపై ఆసక్తిగా ఉంది. ఆటో రంగంలో రివర్సల్‌ పర్సంటేజ్‌ అధికంగా లేనప్పటికి, మరికొన్ని నెలలలో ఈ పునద్ధరణ ఉంటుందనే సంకేతాలు మాత్రం ఉన్నాయి. మార్కెట్‌ ఇప్పటికే దీనిని గుర్తించింది. ఇప్పటికే కొన్ని స్టాకులు 25-30-40 శాతం పెరగడం చూశాం. మొత్తంగా మేమైతే ఆటో స్టాకులపై జాగ్రత్తగా ఉన్నాం. నెలవారిగా వచ్చే ఆటో అమ్మకాల డేటాను పరిశీలించి, ఆ తర్వాత మా వైఖరిని అపడేట్‌ చేస్తాం.
నిఫ్టీ 12,000 స్థాయికి..  
  లార్జ్‌క్యాప్‌ స్టాకులు పాజిటివ్‌గా కదులుతుండడంతో పాటు, రిలయన్స్‌ వంటి కంపెనీలపై సానుకూల వార్తలు వస్తుండడంతో నిఫ్టీ డిసెంబర్‌ నాటికి 12,000 స్థాయిని చేరుకోవచ్చు.
రాయితీలతోనైనా వినియోగం ముఖ్యం..

వాహనాల అమ్మకాలు పెరిగినప్పటికి, అది అధికంగా రాయితీలు ప్రకటించడం వలనే జరుగుతోందని,  వినియోగధారిత కంపెనీల అమ్మకాలు పెరిగినప్పటికి అది క్రెడిట్‌ కార్డుల వలనే అవుతోందని కొంత మంది నన్ను అడిగారు. సాధరణంగా పునరుద్ధరణ చక్రం ఈ విధంగానే ప్రారంభమవుతుంది. దీని గురించి అధికంగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనకు ప్రాథమికంగా కావల్సిందేంటంటే వినియోగదారుడు మార్కెట్‌లోకి వస్తున్నాడా? కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాడా? అనేదే ముఖ్యం. అది రాయితీల వలనైనా కావచ్చు లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్ల వలనైనా కావచ్చు. ఈ అమ్మకాల స్కీములు చాలా తెలివిగా తయారై ఉంటాయి. వీటిని గురించి అధికంగా ఆలోచించవలసిన అవసరం లేదు. గత కొన్ని నెలల నుంచి గమనిస్తే వాహన అమ్మకాలు బాగున్నాయి. ఇదే ముఖ్యం. ఒకసారి మంచి నెంబర్లు వస్తే, కంపెనీ స్థాయిలో, మార్కెట్‌ స్థాయిలో నమ్మకం బలపడుతుంది.You may be interested

త్వరలో మరిన్ని పన్ను తగ్గింపులు?!

Tuesday 29th October 2019

ఇన్వెస్టర్లను ఆకట్టుకునే దిశగా ప్రభుత్వ యోచన ఈక్విటీ పెట్టుబడులపై అమలవుతున్న పలు పన్నులను సరళీకరించేదిశగా ప్రభుత్వం త్వరలో చర్యలు ప్రకటించనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను పెంపొందించి, మరిన్ని విదేశీ నిధులను దేశంలోకి ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈక్విటీ పన్నురేట్ల సంస్కరణలు తీసుకురానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌కు సంబంధించిన కీలక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతమున్న దీర్ఘకాలిక మూలధన పన్ను(ఎల్‌టీసీజీ), సెక్యూరిటీ లావాదేవీ పన్ను(ఎస్‌టీటీ), డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీటీటీ)లను ప్రధాని

బుల్స్‌ హల్‌చల్‌ ...సెన్సెక్స్‌ 580 పాయింట్ల ర్యాలీ

Tuesday 29th October 2019

4నెలల గరిష్టం వద్ద ముగిసిన సూచీలు  మెరిసిన మెటల్‌, లాభాల బాటలో అటో షేర్లు నెల గరిష్టానికి నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, నిఫ్టీ​ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌  మార్కెట్లో మంగళవారం బుల్స్‌ హల్‌చల్‌ కొనసాగింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇనెస్టర్లు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ 581.64 పాయింట్లు లాభపడి 39,831.84 వద్ద, నిఫ్టీ 159.70 పాయింట్లు పెరిగి 11,786.85 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఇప్పటివరకు కంపెనీలు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు

Most from this category