News


టాటా మోటర్స్‌ రికవరీ

Friday 12th July 2019
Markets_main1562923670.png-27021

టాటా మోటర్స్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.156.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ అమ్మకాలు జూన్‌లో  5శాతం క్షీణించినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో నేటి ఉదయం మార్కెట్‌ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై దాదాపు 2శాతం నష్టపోయి రూ.153.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మార్కెట్‌ రివకరిలో భాగంగా షేర్లు తిరిగి లాభాల్లో మళ్లాయి. ఒక దశలో  3.50శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.162.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గత ‍ముగింపు ధర(రూ.156.9)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.160 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.141.90  రూ.282.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఇండస్‌ఇండ్‌ లాభంలో 38 శాతం వృద్ధి

Friday 12th July 2019

జూన్‌ త్రైమాసికానికి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభం 38.30 శాతం పెరిగి రూ. 1432.50 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 1036 కోట్ల లాభం ప్రకటించింది. బ్యాంకు క్యు1లో రూ. 1181 కోట్ల లాభం ప్రకటించవచ్చని మార్కెట్‌ అంచనా వేసింది. క్యు1లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం అంచనాలకు దాదాపు అనుగుణంగా రూ. 2844 కోట్లుగా నమోదయింది. ఇదే సమయంలో స్థూల ఎన్‌పీఏలు 2.1 శాతం

వాల్యూ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు?

Friday 12th July 2019

జూన్‌ త్రైమాసికంలో వాల్యూ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోల్లో కొన్ని మార్పులు చేశారు. మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ కారణంగా జూన్‌ త్రైమాసికంలో చాలామంది వాల్యూ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలు నష్టాల్లోకి మారాయి. మార్కెట్లు ఆశించినట్లు ప్రీ బడ్జెట్‌ లేదా పోస్ట్‌ బడ్జెట్‌ ర్యాలీ రాలేదు. దీంతో ఇందుకనుగుణంగా వాల్యూ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలను సర్దుబాటు చేశారు. - డాలీఖన్నా: రెయిన్‌ఇండస్ట్రీస్‌లో వాటాను 2.22 శాతం నుంచి 3.82 శాతానికి పెంచుకుంది. రాడికో ఖైతాన్‌లో వాటాను 1.41

Most from this category