News


2నెలల గరిష్టానికి టాటామోటర్స్‌

Tuesday 16th July 2019
Markets_main1563269412.png-27102

వాహన తయారీ రంగంలో అగ్రగామి సంస్థగా పేరొందిన టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 2నెలల గరిష్టాన్ని తాకాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.160.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్రిటన్‌లో తన అనుంబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ సంస్థ 500 మిలియన్‌ పౌండ్ల రుణాన్ని పొందేందుకు అక్కడి ప్రభుత్వం హామి ఇచ్చినట్లు మంగళవారం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల రూపకల్పన, తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహించేందుకు బ్రిటన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫైనాన్స్ ఏజెన్సీ జేఎల్‌ఆర్‌కు సంపూర్ణ మద్దతు తెలిపినట్లు కంపెనీ తెలిపింది. గతంలో కంపెనీ ప్రకటించినట్లు 2020 నాటి నుంచి విడుదల చేసే అన్ని రకాల మోడల్‌ కార్లను ఎలక్ట్రిఫైడ్‌ రూపంలోనే రూపొందిచే దిశగా బర్మింగ్‌హమ్‌ సమీపంలో కాజిల్‌ బ్రోమ్విచ్ యూనిట్‌ను ఆధునీకరించేందుకు వందల మిలియన్‌ డాలర్లను పెట్టుబడులు పెట్టబోతున్నట్లు టాటామోటర్స్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు టాటామోటర్స్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇంట్రాడేలో 5.50శాతం పెరిగి రెండు నెలల గరిష్టం రూ.170 స్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.3.10లకు షేర్లు గత ముగింపు ధర(రూ.160.95)తో పోలిస్తే 5.8శాతం లాభపడి రూ.170.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్స్‌లో 11శాతం లాభపడింది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.141.90 రూ.282.00లుగా నమోదయ్యాయి.



You may be interested

పీఈల పెట్టుబడుల జోష్‌.... యస్‌ బ్యాంక్‌ ర్యాలీ

Tuesday 16th July 2019

నాలుగు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయనే వార్తలను యస్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ ఖండించినప్పటికి మంగళవారం (జులై 16) ట్రేడింగ్‌లో యస్‌ బ్యాంక్‌ షేరు 10.14 శాతం లాభపడి రూ.102.65 వద్ద ట్రేడవుతోంది.  గత వారంతంలో నాలుగు పీఈ సంస్థల కన్సార్టియం నుంచి బ్యాంకుకు రూ .8,50 మిలియన్ల టర్మ్ షీట్ ఆఫర్ వచ్చిందని, ఈ ఆఫర్‌ ప్రకారం కన్సార్టియం హెడ్‌ కంపెనీకి బ్యాంకులో 10 శాతం

లాభాల్లో రియల్టీ షేర్లు..

Tuesday 16th July 2019

బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ మంగళవారంలో ట్రేడింగ్‌లో 65 పాయింట్లు లాభపడి 11,653.35 వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా  నిప్టీ రియల్టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.94 శాతం లాభపడి 285.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీలో డీఎల్‌ఎఫ్‌ 3.04 శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 2.84 శాతం, పినిక్స్‌ మిల్స్‌ లి. 2.76 శాతం, ప్రెస్టేజ్‌ 2.58 శాతం, శోభా 1.77 శాతం, ఇండియా బుల్స్‌ 0.88

Most from this category