STOCKS

News


టాటామోటర్స్‌ షేరు 10శాతం జంప్‌..!

Wednesday 5th February 2020
Markets_main1580894776.png-31531

ఉత్సాహానిచ్చిన బ్రిటన్‌ జేఎల్‌ఆర్‌ విక్రయ గణాంకాలు

టాటా మోటర్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 10శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.167.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న రెండేళ్లలో కనీసం 4రకాల మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటనతో పాటు వార్షిక ప్రాతిపదికన బ్రిటన్‌లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు జవవరిలో 3శాతం వృద్ధిని సాధించడం,  జనవరి మాసపు విక్రయగణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేరు ఒక దశలో 10శాతం పెరిగి రూ.182.25వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.165.70)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.182.20 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఎఫ్‌అండ్‌ఓ ఫ్యూచర్స్‌ విభాగంలో షేరు అప్పర్‌ సర్కూ‍్యట్‌ వద్ద లాకైంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00, రూ.239.30లుగా నమోదయ్యాయి. 

టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బుధవారం టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ 2020 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ... కనెక్ట్, ఎలక్ట్రిక్, షేర్డ్, సేఫ్ అంశాలపై దృష్టి సారిస్తూ రానున్న రెండేళ్లలో కనీసం 4రకాల మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. ఇతర గ్రూప్‌లతో పోలిస్తే టాటామోటర్స్‌ మెరుగైన భద్రతనిస్తుందని ఆయన తెలిపారు. రెండేళ్ల కిందట  2017 లో టైగోర్‌ను ఆవిష్కరించినప్పటి నుండి రెండు మోడళ్లను లాంచ్‌ చేశాన్నారు. తాజాగా గతవారంలో నెక్సా మోడల్‌ కారును విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేయడంతో పాటు రాబోయే 18-24 నెలల్లో కనీసం నాలుగు ఉత్పత్తులు ఆవిష్కరిస్తున్నట్లు చంద్రశేఖరన్‌ పేర్కోన్నారు. You may be interested

దీర్ఘకాలానికి 15 స్టాక్‌ రికమండేషన్స్‌

Wednesday 5th February 2020

జాబితాలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు కన్జూమర్‌ ఫైనాన్స్‌, ఫుట్‌వేర్‌, హెల్త్‌కేర్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచే అంచనాలను బడ్జెట్‌ మిస్‌ అయినప్పటికీ షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రస్తుత సమయాన్ని వినియోగించుకోవచ్చునని పలువురు మా‍ర్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. పలువురు ఆర్థికవేత్తల ఆశలను బడ్జెట్‌ అందుకోనప్పటికీ మార్కెట్ల ట్రెండ్‌ను దెబ్బతీయలేదని అభిప్రాయపడ్డారు. వెరసి మార్కెట్లు ఇకపైనా మరింత లాభపడే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక ధృక్పథంతో షేర్ల కొనుగోలును చేపట్టవచ్చని సూచిస్తున్నారు. అయితే ఫండమెంటల్స్‌

టైటాన్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థలేమంటున్నాయ్‌..?

Wednesday 5th February 2020

‍దలాల్‌ స్ట్రీట్‌లో ఏస్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా పెట్‌ స్టాక్‌గా పిలువబడే టైటాన్‌ షేరు కంపెనీ ఫలితాలు మంగళవారం మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువడ్డాయి. క్యూ3 ఫలితాలను ఒకసారి పరిశీలించినట్లైతే.... మెరుగైన నిర్వహణతో పాటుగా తక్కువ పన్ను ఖర్చు(లోయర్‌ టాక్స్‌ కాస్ట్‌)లు కలిసిరావడంతో ఈ క్యూ3లో కంపెనీ నికరలాభం 13 శాతం వృద్ధి చెంది రూ.470 కోట్లను ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం అమ్మకాలు 8.50శాతం పెరిగి

Most from this category