News


వారం గరిష్టానికి టాటామోటర్స్‌

Monday 30th December 2019
Markets_main1577692583.png-30530

టాటా మోటర్స్‌ షేరు  సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్లో  వారం రోజుల గరిష్ట స్థాయిని అందుకుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.177.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరకు కొనుగోలుకు ఆసక్తి చూపడంతో ఒకదశలో 2.69శాతం పెరిగి రూ.180.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.1:07ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.176.15)తో పోలిస్తే 2.13శాతం లాభంతో రూ.179.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టాటా మోటర్స్‌ కంపెనీకి.. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్, ప్రకృతి ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌ 500 యూనిట్ల ఎలక్ట్రిక్ టిగర్ సెడాన్ వాహనాలను తయారీ చేసేందుకు ఆర్డర్‌ నిచ్చింది. ఎల్లుండి (జనవరి 01న) డిసెంబర్‌ మాసపు విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00లు, రూ.239.35లుగా నమోదయ్యాయి. 



You may be interested

గృహ రుణాలపై ఎస్‌బీఐ న్యూఇయర్‌ గిఫ్ట్‌

Monday 30th December 2019

వడ్డీ రేటులో 25 బేసిస్‌ పాయింట్ల కోత తగ్గనున్న నెలసరి వాయిదా మొత్తాలు పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) గృహ రుణ వినియోగదారులకు కొత్త ఏడాది శుభవార్తను మోసుకొచ్చింది. ఎస్‌బీఐ.. తాజాగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లలో 25 బేసిస్‌ పాయింట్లు(పావు శాతం) కోత పెట్టింది. దీంతో వార్షిక ప్రామాణిక వడ్డీ రేటు(ఈబీఆర్‌) ప్రస్తుత 8.05 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గనుంది. రేట్ల తగ్గింపును 2020 జనవరి 1 నుంచీ అమలు చేయనున్నట్లు

2019: చౌక వడ్డీ రేట్ల ఏడాది

Monday 30th December 2019

2019లో కేంద్ర బ్యాంకుల రేట్ల తగ్గింపు బాట యూటర్న్‌ తీసుకున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 6 సమీక్షలలో ఆర్‌బీఐ ఐదుసార్లు రెపో కోత ఈ కేలండర్‌ ఏడాదిని(2019) చౌక వడ్డీ రేట్ల సంవత్సరంగా పిలవవచ్చునంటున్నారు పలువురు ఆర్థికవేత్తలు. 2008లో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం తరువాత వరుసగా 9 సార్లు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది జూన్‌లో తొలిసారి రేట్ల తగ్గింపువైపు దృష్టిసారించింది. వెరసి రేట్ల కోతకు

Most from this category