News


5నెలల కనిష్టానికి టాటామోటర్స్‌

Thursday 25th July 2019
Markets_main1564043306.png-27313

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజ సంస్థ టాటామోటర్స్‌ షేర్లు గురువారం 5నెలల కనిష్టానికి పతనమయ్యాయి. నేడు కంపెనీ ప్రకటించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలిత్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చనే అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. నేడు బీఎస్‌లో ఈ కంపెనీ షేర్లు రూ.151.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్యూ1లో కంపెనీ రూ.1,938 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేయవచ్చని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు ఇదే క్వార్టర్‌లో కంపెనీ రూ.1,902 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అలాగే వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 14శాతం క్షీణిస్తుందని అంచనావేస్తున్నారు. క్యూ1 ఫలితాల అంచనాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో షేరు ఒకదశలో 4.40శాతం క్షీణించి రూ.144.65ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.151.25)తో పోలిస్తే 3.50శాతం నష్టంతో రూ.145.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది షేరకు వరసుగా మూడో నష్టాల ట్రేడ్‌కావడంతో పాటు, ఈ ఏడాది(2019)లో ఏకంగా 15శాతం నష్టపోయింది. అలాగే గరిష్టస్థాయి అందుకున్న నాటి నుంచి నేటి వరకు షేరు ఏకంగా 38శాతం నష్టపోయింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 141.90  రూ.282.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ పరిస్థితిని వాడుకోండి: సెంట్రమ్‌

Thursday 25th July 2019

మంచి స్టాకులను ఎంచుకోని ఇన్వెస్ట్‌ చేయండి. వచ్చే రెండు త్రైమాసికాల వరకు ఆర్థిక మందగమనం ఉండవచ్చు. సిమెంట్‌ రంగంలో అల్ట్రాటెక్‌, శ్రీ సిమెంట్‌ను పరిశీలించవచ్చు. టెలికాం రంగానికి దూరంగా ఉండండి: దేవాంగ్‌ మెహతా వచ్చే రెండు త్రైమాసికాలలో మంచి స్టాకులను ఎంచుకోని వాటిలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ పరిస్థితిని వాడుకోండి సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈక్విటీ అడ్వజరీ హెడ్‌ దేవాంగ్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బాధ ఇంకా

బ్యాంకు నిఫ్టీ తీవ్ర హెచ్చుతగ్గులు

Thursday 25th July 2019

ఎస్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా నష్టాల్లోకి జారుకుంది. ఇండెక్స్‌ నేడు 28,981.05 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి నేడు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్లు నెలకొనడంతో ఇండెక్స్‌ ఓ దశలో 288 పాయింట్లు(1శాతం) పెరిగి 29240.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్‌లో

Most from this category